Prathyaksha Daivamu    Chapters    Last Page

ప్రత్యక్షదైవము

శ్రీ కాంచీపుర శక్తిపీఠ పతివై

శ్రీ మాతృ పాదంబు ల

స్తోకానంద మరీచి డోలికల

నెంతో భక్తిc బూజించుచున్‌

లోకంబున్‌ తనతో తరించు నటు

లాలోకించు నిన్‌ దీన పా

లా! కీర్తించెద చంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 1

[కాంచీ నగరం శ్రీ కామాక్షీ నిలయం. ఇది మోక్షదాయకములైన సప్త పురములలో నొకటి. ఆది శంకర భగవత్పాదులు ఈ కంచిలోనే శక్తిపీఠాన్ని స్థాపించారు. జన్మ తరించడానికి జగన్మాతయైన శ్రీ కామాక్షీ పాద పద్మాలనే భక్తితో సేవిస్తూ బాధ్యతాయుతమైన పీఠాధిపత్య భారం వహిస్తూ (1997 సం|| ఫిబ్రవరి 13వ తేదీ నుండి) ఉన్నవారు శ్రీ స్వామి. తనతో బాటు లోకాన్ని గూడా తరింప జేయాలనే తపన. దీనపాలన - శ్రీ స్వామివారి సుదృఢ సంకల్పాలు.]

Among Seven Holy Cities Kanchipuram is one and it is the abode of Adisakthi Sri Kamakshi. His Holiness Sri Adi Sankaracharya established here a Sakthi Pita. While prostrating on the lotus feet of Sri Swamiji for more than multiples of thousands and lakhs times, I would like to bringout the fact that, His Holiness adoring the pitadhipathya right from 13th Feb, 1907 has been the gem of the Country and even the whole world. Words often fail to describe the precious qualities of Sri Swamiji, as His Holiness has got the best motto of uplifting the people of the world along with him. This is the undaunted view of Sri Swamiji.

* * *

పాండిత్యం బిసుమంత లేదు

విపులంబౌ శాస్త్రవైదుష్యమా

బెండౌ - లౌకిక మేమియుం దెలియ

నే విద్యా ప్రసంగంబు నా

దండన్‌ శూన్యము - స్వామి!

పూర్వ సుకృతాత్మన్‌ మీ పదాబ్జమ్ములన్‌

అండం జేరితిc జంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 2

[ఓ స్వామీ! నేను పండితుణ్ణి గాను. శాస్త్ర జ్ఞానం అసలే లేదు. లౌక్యమంటే ఏమిటో బొత్తిగా తెలీదు. ఇంకే విధమైన విద్యలూ నాకు రావు. సంసార సాగరంలో బడి కొట్టు మిట్టాడుతున్న దతరనుఎఎఓఇఆవాణ్ణి. ఇట్టి నేను పూర్వ పుణ్య విశేషం కొద్దీ మీ పాద పద్మాలను అండగా ఆశ్రయించాను.]

Lo ! Sri Swamiji ! I am neither learned nor having the knowledge of Shastra, nor having the worldly knowledge to an atom, or any other knowledge in the least. I am fully immersed in the Ocean of "Samsaram". To my great God's gift I have been able to find your lotus feet under which I seek protection any your indulgence.

* * *

ఒకనాడేc గడుc జిన్ని ప్రాయమున

నత్యుత్సాహినై, తండ్రి కం

చికి నన్‌ జేకొని పోగc గంటి మిము

మీ చేతన్‌ బ్రసాదంబు నం

ది కృతార్థత్వముc జెందినాcడను సుమీ !

నేc డా పితౄణం బెటుల్‌

ప్రకటింతున్‌ వర చంద్రశేఖర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా! 3

[ఓ సారి 11 సంవత్సరాల వయసులో నాకు డబల్‌ టైఫాయిడ్‌ వచ్చింది. చెవి నరాలు బలహీన మవడంతో మా నాన్నగారు మద్రాసులో చూపిస్తామని తీసుకెళ్తూ, మధ్యలో కంచి సరిహద్దుల్లో చెంగల్పట్టు క్రాస్‌లోని పాత శివాలయం (బ్రహ్మ పురీశ్వరాలయం) లో మీ దర్శనం చేయించారు. ఆ రోజు మీరు చేతులారా యిచ్చిన ప్రసాదం తీసుకొంటున్న దృశ్యం నా జీవితంలో మధురాతి మధురం. అతి లోకమైన మీ దర్శన భాగ్యం కల్గించిన మా తండ్రి గారి ఋణం ఎలా తీర్చుకోను స్వామీ?]

Once ! When I was a lad of Eleven, I was attacked with "DOUBLE TYPHOID" and my EAR nerves became weak, my beloved father took me for the treatment at Madras. On our way to Madras my father had the luck of leading one to an old "BRAHMAPUREESWARA" temple situated in the area of Sri Kancheepuram near Chengalput cross, where I had your DARSAN. On that day your Holiness were pleased to give me PRASADAM by your sacred hand, and that scene is ever green in my life. Oh ! Swamiji how can I repay my debts to my beloved father who had the kindness to lead me to your Holiness and made me to have your DARSAN !

* * *

కామాక్షీ సుత ! నాల్గు మాసముల దీక్షన్‌

మీరు 'కర్నూలు'లో

సామీప్యమ్మునc గూరుచుండుమని

హస్తం బెత్తి నన్‌గూర్చి బల్‌

ప్రేమం జూపరె ! నాcటి యాశిషములే

పెం పొందెcబో ధన్యుcడౌ

రామేశుం డికc జంద్రశేఖర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా ! 4

[ఓ స్వామి ! కర్నూలులో మీరు చాతుర్మాస్య దీక్షతో వున్నప్పుడు మీ దర్శనం చేసుకోవాలని వచ్చాను. అపుడు మీరు నన్ను చెంత కూర్చొమ్మని చేయెత్తి దీవించారు. నాపై యెంతో ప్రేమ కురిపించారు. నాటి ఆశీస్సులే యిలాంటి పుణ్యకార్యాల్ని చేయిస్తున్నాయి స్వామీ ! ఇక ఈ రామేశుడు ధన్యడైనట్లే గదా !]

Swamy! Permit me to state that on my way back from Bombay, I came to know that your Holiness had camped at Kurnool. I must say that I was fortunate enough to have your "DARSHAN". At that moment you made me to sit, by putting your holy hand on my head with affection and blessed me. That event is ever green in my heart of hearts. Mostly that kind blessings has made me to do such good deeds. That is the achievement in my life. I must say that this "RAMESAM" is a "DHANYA" with Glory.

* * *

మిము దర్శింపcc జెళ్ళపిళ్ళ కవి

స్వామీ ! యెంతయుం గోరి - వి

క్రమ సింహాఖ్య పురిం గనెం దుదకు

'సార్థం బయ్యె నా జన్మమం'

చమరన్‌ స్తోత్రము సేసె - నే నెవcడనో

యయ్యా ! నుతింపన్‌ మిమున్‌

రమణీయ స్థితిc జంద్రశేఖర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా ! 5

[శతావధానులు, కిం కవీంద్ర ఘటాపంచానను లనబడు తిరుపతి వేంకట కవులలో ఒకరై ఉమ్మడి మదరాసు రాష్ట్ర ప్రభుత్వ ఆస్థాన కవులైన శ్రీ చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రిగారు తమ చివరి రోజులలో మిమ్మల్ని చూడాలని యెంతగానో తపించి, చివరకు నెల్లూరిలో మీ దర్శనం చేసుకొని 'నా జన్మ ధన్యమైన' దంటూ మిమ్ములను స్తుతించారే. అంతటి వారిచే స్తుతించబడిన మిమ్ములను గూర్చి ఏమీ చెప్పడానికి గూడా నాకు అర్హత లేదు స్వామీ !]

Oh ! Swamiji ! Stalwarts like "Sathavadhanis" and in addition the most reputed Sri Chellapilla Venkata Sastri, one amongst "TIRUPATI VENKATA KAVULU" who was king of writers and a poet laurel had the great desire to have your "DARSAN" from a long-time and in the end he was fortunate to have your "DARSAN" at NELLORE and offered his tributes and said for himself. "I am fortunate enough and my life is purified." I am nothing in comparision to such stalwarts and how can 1 narrate about you. That is to say I am not at all competent enough,

* * *

పదమూc డేడులకే యతీశ్వరుcడవై

భాసించి, దృశ్యమ్ము బు

ద్బుద మంచెంచి పరార్ధ్య మాత్మ పదమున్‌

బోధించి లోకానకున్‌

బదిలంబైన నిధాన మైతివి గదా !

పాపౌఘ ఘోరాంధకా

ర దినేంద్రా ! వర చంద్రశేఖర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా ! 6

[పదమూc డేళ్ళకే యతీశ్వరుడి వయ్యావు. ప్రపంచం నీటిబుడగ లాంటిదనీ, పరమ పదమే శ్రేష్ఠతమమైనదనీ బోధిస్తూ, దట్టమైన పాపాంధకారంలో మునిగిన లోకానికి జ్ఞాన సూర్యుడి వయ్యావు.]

Oh ! Yethikula Tilaka ! You became "Yathi" at your age of thirteen. Right from that time you are shining like Sri SURYA BHAGAVAN by preaching - that - this world is nothing but water bubble that - Paramapada is the highest abode etc., to the people, who are immersed in committing Sins in Dark innocense and have thus proved as "GNANA SURYA."

* * *

అది యేమో భవదీయ పాదముల

దోసో7హమ్మటంచుం బడన్‌

వదలున్‌ గిల్మిష సంచయమ్ము.

మదిలోc బ్రాపించు సంతృప్తి మీ

యెదలోc బొంగు కృపామృతమ్మె కద

స్వామీ దీనికిం గారణం

బదెపో నిక్కము చంద్రశేఖర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా ! 7

[మితిలేని కష్టాల్లో తగుల్కొన్న వారు 'దాసో7హ'మ్మని మీకు పాదాభివందనం చెయ్యగానే పాపాలు పటాపంచలై అమితానంద పారవశ్యం చెందుతారే ! ఇదెలా సాధ్యం? ఓ స్వామీ ! దీనికంతా కారణం మీ హృదయంలో పొంగి పొరలే దయామృత ప్రవాహమే అని నా అభిప్రాయము.]

Lo ! DAYAMAYA ! It is wonder of wonders when people suffering with unfold troubles, so soon they prostrate on your lotus feet saying they are your "DASOAHAM" all their SINS are thrashed into pieces and suddenly feel "AMITANANDAM" ! How can it be possible ? My "ANTARATMAN" says that the flow of nector of your "DAYA" which is inherited in your heart of hearts is the definite cause !

* * *

మెడలోనన్‌ రుదురాక పేరు

లెదలో మెండౌ కృపాపూరముల్‌

ఒడిలోనన్‌ గర పంకజాతయుగ

మధ్యోర్విన్‌ సుపాలాశమున్‌

గడు శోభిల్లు కషాయ శాటి -

నుదుటం గన్పట్టు భూతి చ్ఛటల్‌

సడలించున్‌ జని చంద్రశేఖర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా ! 8

[మీ రూపం జన్మ బంధాల్ని ఒక్క పెట్టున సడలించి వేస్తుంది. మోక్ష మార్గాన్ని చూపెడుతుంది. ఏమిటా రూపం? మెడలోనేమో రుద్రాక్ష మాలలు. ఒడిలో ధర్మ దండం. తలపై కాషాయ వస్త్రం. నుదుట విభూతి చ్ఛటలు. హృదయంలో దయా ప్రవాహం. ఆహా ! ఏమి మీ సందర్శన భాగ్యం. అతి లోకం. అత్యద్భుతం.]

SWAMYJEE! Your beautiful body structure will at once shake off the bondage of birth to one and all. Your "DARSAN" will show the way for liberation. What is that beauty! Your neck with glittering "RUDRAKSHAMALA", "DHARMA DANDA" on you, "KASHAYA VASTHRAM" on your head, "VIBHUTI" lines on your fore-head ! Above all the flow of 'DAYA' in your heart of hearts ! Wonderful ! What kind of good luck we are having. This is surely an experience of nector worlds-even very ashtonishing !

* * *

మీ నేత్రమ్ములు జ్ఞాన సూర్యు లయినన్‌

మెండౌ దయా పూర్ణతన్‌

రాణించున్‌ గద భక్త సంఘమునకున్‌

రాకేందు శోభావృతం

బై నైష్కామ్య పథమ్ముc దెల్పు నవియై

ఆనందముం గూర్చుc బో

మౌన వ్యాఖ్యను - చంద్రశేఖర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా ! 9

[స్వామీ! మీ నేత్రాలు జ్ఞాన పుంజాలు. సూర్యతేజో నికుంజాలు. అయినప్పటికీ దయారస భరితాలు. కాబట్టి పున్నమి నాటి చంద్రుడిలాగా చల్లని చూపులతో ఆహ్లాదాన్నందిస్తూ, మౌనంగా మోక్ష మార్గాన్ని బోధిస్తుంటాయి.]

SWAMYJI ! Your blessed eyes are a set of "GNANA" like the God of light-no other than SURYA BHAGAVAN. Though it is so, in fact your eyes are again no other than "CHANDRA BHAGAVAN". The clear cristal fact is your eyes are full of DAYARASAM-as though the moon who shines so glitteringly on full moon day-which your eyes give the pleasure of all cool look, and stability-I mean-not speaking-but straightly preaching the way of "MOKSHA"-by the very look !

* * *

వయసా తొంబది దాటి పోయెcగద

యుద్భాసించు దేహం బనా

మయ దూరంబది చూడ పుల్ల గతిగా

మ్రగ్గెన్‌ సుమీ మావ్డిు పం

డయి ముష్టి న్నిముడంగనై నయన తేజో

నంతమై దివ్యమై

దయ భాసిల్లుచుc జంద్రశేఖర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా ! 10

[స్వామీ! తొంభై సంవత్సరాల వయసు దాటినా - సంపూర్ణ ఆరోగ్యంతో మ్రగ్గిన మామిడి పండులాగా సన్నగా పూచిక పుల్లలాగా పిడికిట నిమిడే ఆకారం మీది. ఆ కళ్ళు మటుకు తేజస్సుతో జ్వలిస్తూ వుంటాయి. ఆ జ్వాలలో చంద్రుని చల్లదనం ఉంటుందే తప్ప రజోగుణం కన్పించదు.]

Swamy ! Though your Holiness has passed age of 90 years, and you look like a fully riped mango with good and sound health, but your structure exhibit like a small straw to look at. But your eyes are shining like the moon showering nector like cool rain on your desciples. The eyes are more dazzling and there will be only coolness and not emiting bad look at all !

* * *

స్వామీ! పండెను మీ తపస్సు -

వెనుకన్‌ పండెన్‌ సుమీ మేధయున్‌

ఆ మార్గమ్మునc బండె దేహమును

దా నట్లే ఫలించెన్‌ వచ

శ్శ్రీ మాధుర్యము - మీదు భక్త తతికిన్‌

జేతమ్ములుం బండcగా

నామోదించవె! చంద్రశేఖర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా ! 11

[ఎన్నో యేడుల మీ తపస్సు ఫలించింది. అలాగే మీ మేధస్సూ దేహమూ కూడా పండాయి. దీనికి వాక్‌సిద్ధి తోడు గావడంతో వశ్యవాక్కు లయ్యారు. ఇటువంటి మీరు మీ భక్తజనుల హృదయ క్షేత్రాలు గూడా పండేటట్లు భక్తి సంస్కార బీజాలు మొలకెత్తేటట్లు అనుగ్రహించ రాదా స్వామీ!]

Oh ! Swamy 1 Your meditation for many years have yielded fruits. In the same manner the power of intelect and body have improved and riped in you. Adding to this you have become a "Vangmaya Moorthy". So being it is very easy for you to see that the seedlings of "Bhakti" in the "Kshetra" of your devotees heart of hearts grow into small plants.

* * *

ధరలో నెందఱు లేరు తత్త్వ విదు

లాత్మ జ్ఞాన పాండిత్య ధీ

వరు లైనన్‌ - భవదీయ దర్శన

సుఖ స్పర్శా విధిన్‌ బోల దే

దరిలోc గాని - అదేమి నిర్మలతయో

తాదాత్మ్య సంసిద్ధి యె

ల్లరకుం గూర్చెదు - చంద్రశేఖరయతీంద్రా !

భక్త ముక్తి ప్రదా ! 12

[ఈ లోకంలో ఎందఱో తత్త్వ విదులు, విద్వాంసులు వున్నారు. అయినా మిమ్మల్ని చూచినప్పుడు కలిగే ఆనందాను భూతి మఱక్కడా లభించదు. అదేమిటో స్వామీ! మీ అద్భుతమైన నిర్మల స్వభావంతో అందరినీ ఆనందాంబుధిలో ఓలలాడిస్తారు గదా!]

Sri Gurujee ! There are so many Saintists and Educated Stalwarts on the face of the earth. I do not know Swamyjee, the so called charm will fail at the sight of them, when compared to your "Darsan". You will win all and the feeling of pleasure to one and all will immediately rise to the peak; It may not be out of place when I say all will be immersed in the sea of pleasure ! This is the wonder of wonders.

* * *

జననం బాదిగ నెన్ని పాపముల

నిచ్ఛా నిచ్ఛతన్‌ సల్పినా

డనో సామీ ! యిపుడైన జన్మచయ

గాఢ స్ఫార దుర్వాసనల్‌

సన - సాక్షాచ్ఛివ మూర్తి మిమ్ముc గొలువన్‌

స్వాంతమ్ము కాంక్షించె - చి

ద్ఘన ! కాపాడుము చంద్రశేఖరయతీంద్రా !

భక్త ముక్తి ప్రదా ! 13

[పుట్టింది మొదలు తెలిసీ తెలియకుండా ఎన్ని పాపాలు చేశానో ఏమో! పోనీ - ఇప్పుడైనా జన్మ జన్మల దుర్వాసనలు పోవడానికని అపర శివావతారులైన మిమ్ము సేవించడానికి నా చిత్తం తపిస్తూ వుంది. ఇలాంటి దీనుణ్ణి నన్ను కరుణించలేవా స్వామీ!]

Gurujee ! Let me confess that right from my date of birth, I have committed many wild-sins, knowingly or other wise, which I cannot account ! However I am at your mercy and I am deeply thinking to get rid of sins, I might have committed in all my re-births, and to my good luck I want to serve under the shelter of you with all sincerity. I am hopefully when I pray and crave for your indulgence !

* * *

భరతోర్వన్‌ జయ యాత్ర సల్పి

జడతా భావమ్ము దీనావళిన్‌

దరలన్‌ జేసి, అనంత సౌఖ్యముల

సంధానించి, ఆశీస్సులన్‌

జరితార్థత్వము నందc జేసితి గదా !

స్వామీ దయాంభోనిధీ !

దరహాస స్ఫుర ! చంద్రశేఖర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా ! 14

[స్వామీ ! మీరు యావద్భారతం కాలి నడకతో దిగ్విజయంగా సంచరిస్తూ మధ్య మధ్యలో మిమ్ముల నాశ్రయించిన దీనజనులకు దరహాస వదనంతో ధైర్యం చెప్పారు. సహజ సిద్ధమైన మీ దయా స్వభావంతో వాళ్ళ జీవితాలకు ఊపిరి పోశారు. చల్లగా ఆశీర్వదించారు. మీ దయ నెలా ప్రస్తుతించాలో చెప్పండి.]

Swamyjee ! Your Holiness have covered the whole "Bharatha" on foot, and while on "Pada Yatra" you have pumped bravity with smiling face to all the "Demeans" who prostrated on your feet with many kind of anxiety. With your natural "Daya" you have poured fresh life in them-and blessed them ! Kindly educate me how I should praise your "Daya" !

* * *

అలనాc డెట్టులు మూక శంకరులు

ప్రత్యగ్భక్తి భావంబు సం

ధిలc బంచా శతిc జెప్పి భక్త తతికిన్‌

నిర్వాణ మార్గమ్ము ని

మ్ముల బోధించిరొ - అట్లు సెప్పc

దరమా పుణ్యాత్మ మావంటి వా

రల కీ ధాత్రిని - చంద్రశేఖర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా ! 15

[ఓ పుణ్య మూర్తీ ! ఆనాడు మూక కవి (ఇతను మూగవాడు) శ్రీ కామాక్షీదేవిని సేవిస్తూ ఆమె కరుణతో మూకత్వం పోగా - అప్పటికప్పుడే అత్యద్భుతమైన కవితా ధారతో 500 శ్లోకాల్లో అమ్మవారిని స్తుతిస్తూ (దీన్నే మూక పంచాశతి - 5x100=500 - అంటారు. భక్త జనానికి నిర్వాణ మార్గాన్ని బోధించారు గదా ! అంతటి మహాత్ముల కవితలన్నీ వుండగా ఇక మా వంటివారు చెప్పవలసిం దేముంటుంది స్వామీ !]

Oh ! Mountain of good acts ! Sometime back on a fine day a dumbman (Mooka) sat infront of "Sri Kamakshi" and with her blessings the dumbness vanished and he immediately praised the Goddess with 500 Stanzas [This instantaneous prayer is called "Mooka Panchasathi" 5 x 100 = 500]. Later on he adored the "Peetam" of Kamakoti Samsthanam as well by the grave of Goddess Sri Kamakshi and by giving this instance you have educated the devotees shown the way of Nirwana, when such a "Kavitha" a "Mahatman" is there, afterall what are we poor creatures ?

* * *

ఆ పంచాశతి శ్లోక రత్న తతి

అత్యంతంబు భక్తాళికిన్‌

శ్రీ పారాయణ యోగ్యమైన దనుచున్‌

శ్రీ కాంచి కామాక్షీ దే

నీ పార్శ్వంబుల పాల ఱాల పయి

నావిష్కారముం జేయ తే

దా పుణ్యాత్మక ! చంద్రశేఖర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా ! 16

[ఆ మూక కవీంద్రుడు చెప్పిన పంచాశతి (500) శ్లోకాలనన్నిటినీ భక్తజనులకు నిత్యపారాయణ యోగ్యంగా భావించి, పాల ఱాలపై దేవనాగర లిపిలో చెక్కించి కంచిలో శ్రీ కామాక్షీదేవి మూల స్థానానికి చుట్టుప్రక్కల గల గోడలపై పొదిగించిన పుణ్యాత్ములు మీరు.]

Oh ! Swamiji ! That so called dumb Kavindra's recital of five hundred 'Slokas' in Sanskrit Language have been inscribed on the morbal stoned walls of "Sri Kamakshiamman" Temple for the benifit of the devotees which they pleasingly recite day in and day out. And Lo ! That tremundous work of inscription has been done by is no lesser person than your Holiness !

* * *

దివ్యంబౌ భవదీయ జీవితము

ధాత్రిన్‌ వెల్గు చంద్రార్కమై

భవ్యంబై మహిమా సమేతమయి

శోభల్‌ గూర్చెడిన్‌ సర్వ సం

సేవ్యంబై యతిలోక గణ్యమయి

దుశ్శీల ప్రజా జ్ఞానదా

తవ్యంబై వర చంద్రశేఖర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా ! 17

[అనంత మహిమా సమన్వితమూ, యతి లోకంలో అగ్రగణ్యమూ, శీల రహితులకు విజ్ఞాన ప్రదమూ అయిన మీ దివ్యజీవితం సూర్యచంద్రాదు లున్నంతవరకు లోకానికి ఆదర్శప్రాయంగా నిలిచి పోతుంది.]

Oh ! Gurujee ! Your countless "Mahimas" being first amongst sages, "Vignana Prada" to less learned who have no good qualities and your good way of life teachings will ever stand eternally, till Gods like "Sun" and "Moon" are existing !

* * *

కను మూయం దెరువన్‌ వినూత్న గతి

మోక్షం బిచ్చు మీ రూపమే

కనుపించున్‌ మఱి యొండు

నేత్రములకున్‌ గానంగ రాదేమొ మీ

అనుకంప న్నిరతంబు నాపయి నిడన్‌

బ్రార్థించెదన్‌ బ్రోచుడీ

అనుమానింపక చంద్రశేఖర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా ! 18

[ఓ స్వామీ ! అది యేమోగాని కన్ను మూసినా తెరచినా మోక్షాన్ని ప్రసాదించే మీ రూపమే నిత్యనూతనంగా కనిపిస్తుంది తప్ప, మరేమీ ఈ కళ్ళకు కానరాదే. ఇట్టి స్థితిలో వున్న నన్ను అనుమానించకుండా-దయ జూడుమని ప్రార్థిస్తున్నాను.]

Oh ! Swamyjee ! I do not know the reason why I am finding always your figure, when I close my eyes or open my eyes, that figure (Roopam) of yours in eternal new forms, and nothing else. When I am at this stage. Oh ! Gurujee, kindly do not suspect me, and pray admit me as one of your devotees !

* * *

స్వామీ ! మీ పద పంకజాతముల

నిచ్చల్‌ గొల్చు భక్తాళి గా

రాముల్‌ సూపుచు సర్వ సంపదలతో

భ్రాజిల్లcగాc జేసి - మీ

రే మాత్రమ్మును సౌఖ్య మెంచ

కఖిలోర్విన్‌ జుట్టరే పాదయా

త్రా మార్గమ్మునc జంద్రశేశర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా ! 19

[స్వామీ ! మీ పాద పద్మాలను నిరంతరం భజించే భక్తజనులు ఆయురారోగ్య భాగ్యాలతో అలరారేటట్లు చూస్తారు మీరు. కానీ మీ సుఖాన్ని గూర్చి ఏ మాత్రమూ ఆలోచించరు. వయ సెంతగా పైబడినా లక్ష్యపెట్టక పలుమార్లు కాలి నడకన యావద్భారతం చుట్టి వచ్చారు గదా !]

Oh ! Gurujee ! You are very kind to your devotees, who prostrate on your lotus feet and you will see that they are all blessed by you to be healthy, with long life and wealthy and keep happy and gay. Where as your best quality of selflessness without caring for your well being shows. Though you have grown pretty old, you un-mindfully conducted "Pada Yatra" many a time covering the whole "Bharatha" always preaching "Dharma", which qualities no one can active.

* * *

మీరే భారత భవ్య సంస్కృతికి

స్వామీ మూలకందంబు - మీ

దౌ రూపంబది నాల్గు వేదముల

సారాంశంబు బోధించు - మీ

కారుణ్యామృత వృష్టియే ప్రజకు

మోక్ష ప్రాప్తిc జేకూర్చు వి

స్తార ప్రక్రియc జంద్రశేఖర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా ! 20

[పవిత్ర భారతీయ సంస్కృతి సౌధానికి మీరే మూల స్తంభం. చతుర్వేద సార సమ్మిళితం మీ రూపం. మీ దయామృత ధారలే సకల జనులకు సౌఖ్య ప్రదం.]

Swamyjee ! You are the main pillar for the sacred "Bharathiya Samskruthi". Your blessed personality is nothing but the essence of all the four "Vedas" put together. Your kind nector showers are only the salvation to one and all !

* * *

వయసా తొంబది దాటి పోయినను

దేవా ! పాదయాత్రా గతిన్‌

రయ మేపారcగ సంచరించు

మిము గానన్‌ దైవమే యిట్టు లా

త్యయిక ప్రక్రియ ధర్మము న్నిలుపగా

దా వచ్చె నన్పించు - ని

ర్భయ సౌఖ్యం బిడుc జంద్రశేఖర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా ! 21

[స్వామీ ! తొంభై సంవత్సరాల వయసు దాటినా వాహనాల మీద తిరుగాడకుండా, కేవలం కాలి నడకతోనే తిరుగాడే మిమ్ము చూస్తుంటే - ధర్మం భ్రష్టమౌతున్న ఈ తరుణంలో సాక్షాత్తు భగవంతుడే హడావుడిగా అవతరించినాడేమో అనిపిస్తుంది. అలా ఊహిస్తే ఆందోళన తొలగిపోయి హాయిగా వుంటూ వుంది కూడా.]

Oh ! Swamyji ! Though you are ninety years and more. You have given up travelling on vehicles and prefered hard walking from place to place. When we find you in such a state, it appears to my mind that Sree Bhagavan himself has suddenly come in the form of your Holiness, while so called Dharma is being away from the mob. If so imagined people will develop mental peace forgetting all worries and keep happy and gay.

* * *

పురముల్‌ పల్లెలు పట్టణంబులు

నగంబుల్‌ తీర్థ భూముల్‌ సరి

ద్వర తీరంబు లరణ్యముల్‌ దిరిగి

యద్వైత ప్రభావమ్ము ని

ద్ధరకుం జాటరె బ్రహ్మమే నిఖిలమన్‌

తత్త్వమ్ము బోధించుచున్‌

బరమోదారతc జంద్రశేఖర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా ! 22

[స్వామీ ! మీరు పాద యాత్రలో ఎన్నో పల్లెలు, పట్టణాలూ - శ్రీశైలాది పర్వతాలు, పాతాళ గంగ లాంటి తీర్థాలూ, నదీనదాలూ, అరణ్యాలూ తిరిగి తిరిగి 'బ్రహ్మమే సత్యము' అనే అద్వైత సిద్ధాంతాన్ని లోకానికి బోధించిన ఉదార స్వభావులు మీరే కదా!]

Swamijiee ! You have made known to all that "Brahma is True" by travelling on "Pada Yatra" covering many Villages, towns, big cities, Hills like "Sree Sailam" piligrim centres like "Pathala Ganga" Rivers, forests, with your Holy broadmindedness. Thus you have successfully preached "Adwaitam" one and all.

* * *

మీ జన్మం బఖిలమ్ము సార్థకము

స్వామీ ! మాతృ సత్పాద నీ

రేజంబుల్‌ మది నిల్పి కొల్చుటయు -

ధాత్రిన్‌ బాద యాత్రాగతిన్‌

బూజల్‌ సేకొని సంచరించుటయుc

బ్రాక్పుణ్య ప్రభావంబయై

భ్రాజిల్లుం గద చంద్రశేఖర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా ! 23

[స్వామీ ! పూర్వ పుణ్య విశేషం కొద్దీ నిరంతరం శ్రీ కామాక్షి దేవియొక్క పాద పద్మాలను భక్తితో సేవిస్తూ, పాద యాత్రలతో పవిత్ర భారతాన్ని పలుమార్లు సంచరిస్తూ భక్తపరుల పూజలు చేకొంటూవున్న మీకు ఈ జన్మ ధన్యమైన దనడంలో - ఏ మాత్రమూ సందేహం లేదు.]

Oh ! Mahatman, In accordance with your past good deeds you have been serving the lotus feet of Sri Kamakshi Devi always with devotion, by travelling with "Pada yatra" the whole of the Holy Bharatham for several times, receiving offerings from good devotees are the most good qualities amongst others. By this you have no doubt achieved "Dhanyatha".

* * *

కర మాశ్చర్యము మీదు జీవనము

మోకాల్బంటి వస్త్రమ్ముc దా

ల్తురు - గుప్పెం డటుకుల్‌ భుజించి

కడు సంతోషింత్రు - పైపంచె యే

డ్తెఱ భూ శయ్యగ నిద్ర వోదు రట !

యెంతే శీత వాః స్నాన సుం

దర గాత్రం బట - చంద్రశేఖర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా ! 24

[ఓ స్వామీ ! మీ జీవనం అత్యాశ్చర్యకరమైనది. మోకాలిదాకా వస్త్రం ధరిస్తారు. గుప్పెడటుకులు భుజించి సంతోషిస్తారు. దైనందిన కార్యక్రమాలతో పాటు ఎడ తెగకుండా భక్తాదులకు దర్శనమిస్తూ అలసి సొలసిపోయిన మీరు పైపంచెనే నేలపై పఱచుకొని నిద్ర పోతారు. ఉదయాన్నే లేచి యెంత చలి కాలమైనా చన్నీటితోనే స్నానం చేస్తారు. దేహం పట్ల మీరింత నిర్లక్ష్యం వహిస్తున్నా బ్రహ్మజ్ఞాన పూర్ణమైన మీ రూపం మాత్రం మిక్కిలి సుందరమయింది సుమా !]

Oh ! Swamy ! Your life is wonderful. You will tie a piece of cloth upto your knee on your waist. You will take only a morsel of boiled crushed rice as food and be more pleased with that. In your daily routine you will be answering every one who calls on you without rest. After toiling so much, and being exhausted you will simply spread your upper cloth on the floor, and go to sleep. Then you will get up before dawn and take bath in cold water in the chillness. Though you have been ignoring the well keeping of your body, Oh ! it is marvellous that your body is beautiful only on your "Brahma Gnanam" itself which is matchless-again.

* * *

ఘన మౌనస్థితి నిశ్చలం బయిన

ప్రజ్ఞా శక్తితో వైదికో

ప నిషత్సంచయ మెల్లc బుక్కిటను

నిర్బంధించి శాస్త్రార్థ మె

ల్లను నాపోశన మెత్తి నిల్చితిరి గారా

వేద ధర్మాకృతిన్‌

గనుల న్నిల్పుచుc జంద్రశేఖర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా ! 25

[స్వామీ ! మీరు అతి లోకమైన మౌన ధారణతో, స్థిత ప్రజ్ఞతో వేద వేదాంగాలూ, ఉపనిషత్తులూ, శాస్త్ర పురాణాదుల నన్నింటినీ అపర అగస్త్యుడి లాగా పుక్కిట నిర్బంధించారు. సందర్భోచితంగా వీటిని పేర్కొంటూ ఉపన్యాసాలలో విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంటారు. వేద విజ్ఞాన కాంతి పుంజాలను కన్నులలో పదిలపఱచుకొన్నవారు మీరు.]

Swamyji ! You have arrested and digested all the Veda, Vedangas, Upanishads and Shastra Puranamas with your special "Mouna Dharanam" with undisturbed intelligence and you are no other than "Agasthya Maharshi" himself who has swallowed the whole of the sea in one gulp. According to reference to context you will bringout during the speaches. "The Viswa Roopa" and show the knowledge of all Vedanthas. Your eyes are glittering with the light of Vedantha knowledge !

* * *

సభలో మెల్లగ మాటలన్‌

దడుముచున్‌ సాగించి, ఆపైన వా

గ్విభవం బొప్పగ నార్ష ధర్మముల

నావిష్కారముం జేయుచుం

డ, భళీ శంకర దేవుcడే యనెడి

వేడ్క న్నించి భీతాళికిన్‌

అభయం బిచ్చెదు చంద్రశేఖర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా ! 26

[మీ ఉపన్యాస ధోరణి చిత్రమయింది. మాటలను మెల్ల మెల్లగా తడుముకుంటూ సభను ప్రారంభిస్తారు. ఆ పైన అత్యద్భుతమైన తీరులో వాగ్గంగను ప్రవహింపజేస్తూ వైదిక ధర్మాలను, సంస్కృతీ సంప్రదాయాలను ఆవిష్కరిస్తూ పోతారు. ఆయా సమయాల్లో మిమ్ము చూస్తుంటే సాక్షాత్తు పరమశివుడే ననిపిస్తుంది. భయాన్ని పోకారుస్తుంది.]

Oh ! Swamyji ! Your oratory is very wonderful. You will start your speech by using punctuations slowly in the first instance. Thereafter you will pick up greater speed as though the flow of Ganged and in that you will inculcate "Vydika Dharmas", "Cultures and traditions", when we see you during that time we feel as though that Lord "Paramasiva" himself is before us. Ultimately with the result all the fears will vanish from the minds of devotees.

* * *

మహితంబౌ గతి ఱాలు రప్పలవి

యేమాత్రమ్ము లేకన్‌ ముహు

ర్ముహు రాశోధితమై సుభీజ తతి

కామోద ప్రదంబై క్షుథా

ప హరంబై మను క్షేత్రమో యనగ

మీస్వాంతంబు కాపట్య సం

రహితంబౌc గద ! చంద్రశేఖర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా ! 27

[రాళ్ళు రప్పలు ఏరి, చక్కగా దుక్కి చేసి, మరల మరల వెదకి, శేషించిన రాళ్ళను గూడా తీసి పారేసి, విత్తనాలు సుళువుగా మొలకెత్తే రీతిలో తీర్చిదిద్దబడి, ఆకలిని పోగొట్టే పొలంలాగా - మీ హృదయ క్షేత్రం గూడా కామక్రోధాదుల కే మాత్రం తావు లేకుండా, కపటం లేకుండా వుండి భక్త జన సులభంగా వుంది గదా.]

Swamiji ! Your mind is easily be won by your devotees which is like Goddess Earth, free from six inner enemies (Kama, Krodha etc.,), free from cunningness would yield good gifts. This is just as a former clears all the stones, pebbles etc., tills the land, sows seeds and seedlings and gets his full share of yield in the form of Paddy etc., in plenty, to his satisfaction.

* * *

శ్రీమత్‌ హైందవ ధర్మ సంస్కృతికి

నిశ్శ్రేయమ్ముc జేకూర్చు స్వా

మీ ! మాధ్యందిన భాను మండల

విభా మేయ ప్రభామూర్తి ! వి

శ్వా మోద ప్రద ! మిమ్ముc గొల్చుటకునై

స్వాంతంబు కాంక్షించె - మీ

దౌ మాహాత్మమె చంద్రశేఖర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా ! 28

[హైందవ ధర్మ సంస్కృతీ సముద్ధరణకై అవతరించినా, సర్వ మత సమన్వయాన్నీ, లోక క్షేమాన్నీ కోరుతూ, అనంత కాంతితో తేజరిల్లే మిమ్ములను స్తుతించాలని నా మనస్సు కోరుతూ వుంది. దీనికంతా కారణం మీ ఆశీర్వాద మాహాత్మ్యమే-అని నా అభిప్రాయము.]

Though you are born to uplift the culture of Hindu Dharma, you will not ignore the other religions with the desire of all being well and while so you will be seen in such a way without dazzling face with delight and my mind will not stop without praising you. I feel it is only with your good blessings showered on me, I am able to say so !

* * *

లేనే లేరు ధరా తలమ్మునc

బ్రజాళిం జక్కగాc జూచి ప్ర

జ్ఞా నైపుణ్యము తోడc బ్రోచు

కరుణా నంతాత్ము లీనాcడు - కా

నీ, నీ నిర్మల పాదధూళి

కలుషానీకమ్ము వేద్రుంచి బ్ర

హ్మా నందం బిడుc జంద్రశేఖర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా ! 29

[స్వామీ ! ఇప్పట్లో నిజంగా ప్రజల మేలు గోరి, త్రికరణ శుద్ధితో వాళ్ళకు సేవచేసే ప్రభుత్వాధినేతలు కరువయ్యారు. ఇట్టి పరిస్థితుల్లో మీరు యావద్భారతం కాలినడకన సంచరిస్తూ అందరికీ అందుబాటులో వుండి ఆనందాన్ని పంచి పెడుతున్నారుగదా !]

Swamyjee ! At present it has become very rare that the Leaders who have adorned the seats in the Government would serve the people with all sincerity. At such a period your Holiness would track all over the Country by foot, and you are nearer to the mass and providing happiness to one and all. This is magnanimous.

* * *

ధీ సౌక్ష్యంబును, సౌమ్య భావమును

నెంతే శాంత చిత్తంబుc బే

రాస ల్లేని గభీర మూర్తియును

ధైర్యాన్వీత నిర్వైరతా

వ్యాసంగంబులు - లోన వెల్పటను

నుద్భాసించు శ్రీ కాంచికా

వ్యాసా ! కావుము చంద్రశేఖర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా ! 30

[బుద్ధికుశలత, సౌమ్యభావం, శాంతం, ఆశ లేమాత్రమూ లేని గంభీర మూర్తి - ధైర్య స్వభావం కల్గిన మీకు శత్రువు లెవరున్నారు స్వామీ ! ఎవ్వరూ లేరు. తపోధనులైన మీరు శ్రీ కాంచీ నగరానికి వ్యాసభగవానుడి లాంటి వారు.]

Swamijee ! I cannot but call you as "Apara Vyasa Bhagavan" adoring the beautiful city of Kanchi as there are all good qualities in you-like "Wisdom" in big order - piousness - peace, having no desires with magestic views, courage etc., you have no enemies at all.

* * *

నీవే పో నడయాడు దైవమట !

నిన్‌ నిత్యంబు సేవించు వా

రే వారున్‌ స్థిర శాంత చిత్తులట !

కోర్కెల్‌ వారలం జేరcగా

బోవం జాల వటంచు - భక్త తతి

రేపు న్మాపు మిమ్మే మహా

త్మా ! వర్ణింతురు చంద్రశేఖర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా ! 31

[ఓ మహాత్మా ! తిరుగాడుతున్న దేవుడివి నీవే. నిన్నే ప్రతి నిత్యమూ సేవించేవారు ఎవరైనా సరే నిశ్చింతగా వుంటారు. అలాంటి వాళ్ళను కోరికలు చుట్టు ముట్టc జాలవు. ఇలాగా భక్తులకు మీ మీద దృఢ ప్రత్యయం (నమ్మకం) వుంది.]

Oh ! Mahathman ! You are the moving God. Who ever he or she may be, if they daily serve you with all devotion, sure, they are more happy with no wanting. The desires would never come nearer to them at all. Your devotees have such a staunch-belief in you, which is true.

* * *

భూమిన్‌ శయ్యగ, సద్భుజంబె

యుపధా స్ఫూర్తిన్‌ వెలుంగన్‌ వియద్‌

భూమిన్‌ చాందిని యంచు,

శీత పవనంబున్‌ వ్యంజనం బంచు, నా

సోమున్‌ దీప మటంచు, నాత్మ సుఖమే

శుద్ధాంత సౌఖ్యంబు నా

నామోదింపరె - చంద్రశేఖర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా ! 32

[భూమియే మీకు పరుపు. భుజమే దిండు. ఆకాశ##మే పైకప్పు. చల్లని గాలే వింజామర (FAN) చంద్రుడే దీపం. ఇలాగే ఏకాంతంలో ఆత్మానందాన్ని అనుభవిస్తూ జన్మను ధన్యం చేసుకున్నారు గదా మీరు.]

Swamijee ! Your Holiness have made your good life so worthy that I cannot list our your good qualities. You do not care for comforts. You are having earth-floor as your bed; your shoulder as your pillow for the head, sky as top terrace, cold air as your Fan, Moon as the light. In such a manner, you are pleased with being aloof from misery.

* * *

ఏమో మీ మహిమా విశేష మది

స్వామీ ! మీరు కాలూను కు

గ్రామంబైనను నేల యీని నటులై

రంజిల్లు భక్తాళితో

శ్రీమంతంబగు నేత్ర పర్వమయి

నిశ్శ్రేయః పదంబై శివా

రామంబై వర చంద్రశేఖర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా ! 33

[ఓ స్వామీ ! మీ మహిమా విశేష మేమిటో గాని మీ రెక్కడ కాలూనితే అక్కడ - అది కుగ్రామమైనా (చిన్న పల్లెటూరయినా) సరే, తండోప తండాలుగా వచ్చే భక్తజనులతో నేల యీనినదేమో అనేటట్లుగా నేత్ర పర్వంగా అపర కైలాసం లాగా అలరారుతుంటుంది గదా !]

Swamyjee ! What is more, I do not know the power of attracting mob in you is a wonder of wonders, that wherever you visit or stamp your foot on the land, whether it is a big city or a small village in a remote place, people would flow in a good number to have a glimpse of your "Darsan" and that remote place becomes another "Kailasa loka".

* * *

మీదౌ దర్శనభాగ్య మబ్బినను

స్వామీ ! ఘోర దుర్మార్గుడున్‌

స్వాదు స్వాంతుడు గాగ

మాఱుటది యాశ్చర్యంబు గాదే - దయా

యాదోరాశిని నీకృపా మహిమ

యెట్లర్థం బగున్‌ మాకు న

య్యా ! దీనావన ! చంద్రశేఖర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా ! 34

[మిమ్ము దర్శించి ఆశీర్వదా లందుకొన్న ఘోర దుర్మార్గుడైనా సరే ఆత్యాశ్చర్యంగా సాధు స్వరూపుడౌతాడు. దయా నిధివైన నీ కృపా మహిమ మా కెట్లా అర్థమవుతుంది స్వామీ !]

Oh ! Swamy ! Any one who is a bad character, who attains your "Darsan" had your blessings will immediately change himself as a pious man is a wonderful thing. We are unable to measure your good qualities as your Holiness is a "Dayamaya" !

* * *

ఘన సంసార దవాగ్నులం దగులకన్‌

కామాక్షి నే యాత్మలో

ననయంబున్‌ వినుతించుచున్‌

సుఖ మనంత బ్రహ్మమం దున్నదే

జనులారా ! మఱి యొండు గాదనరె -

వాక్చాతుర్యమేపార న

త్యను కంపాగతిc జంద్రశేఖర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా ! 35

[భయంకరమైన ఈ సంసార దవాగ్నుల్లో తగుల్కోకుండా ఎల్లవేళలా శ్రీ కామాక్షీదేవినే ఆత్మలో చింతిస్తూ- ఒక్క అనంత పరబ్రహ్మలో వున్నదే నిజమైన ఆనందమనీ, మరేదీ అలాంటిది కాదనీ మీ వాక్పటిమతో లోకానికి చాటిన మహనీయమూర్తులు మీరు.]

Swamijee ! Your Holiness is such a Mahatman who have shown right path to the whole world saying that Real pleasure is only in "Anantha Parabrahma" which is real "Ananda" and no other teaching would be a match to that.

* * *

ఘన సంసార దురంత తాపహర

మేఘ ప్రాయ గంభీర భా

షణ ! పాపౌఘ మహాటవీ

దహన తేజ శ్శాలినీ రూప వే

ష ! నినున్‌ గూర్చి వచింప శక్య మెటులౌ

సామాన్యులౌ మాకుc బ్రా

క్తన పుణ్యాధిక ! చంద్రశేఖర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా ! 36

[మేఘ గంభీరమైన మీ భాషణములు అనంతమై భయంకరమైన సంసార తాపాన్ని హరింప జేస్తాయి. మీ రూపం, అలాగేవేషం పాప మహాటవిని దహనం చేసే అగ్ని లాంటిది. ఇటువంటి మిమ్ములను గురించి చెప్పడానికి మా బోటివాళ్ళ కెలా సాధ్యమవుతుంది స్వామీ !]

Oh ! Gurujee ! Your dynamic speaches would create much more pleasure in the minds of devotees while their sufferings in their life would easily vanish. Your image is just like fire which would burn all their sins into ashes. How can we be able to say anything about you, Swamijee ?

* * *

ఎటు గన్నన్‌ భువి మానభంగ ఘటనా

స్వీచ్ఛా విహారంబులే

ఎటు విన్నన్‌ వరకట్న బాధిత వధూ

హేయాతి హేయంబులే

ఎటు చూడన్‌ పర హింస్రకా జనమె -

స్వామీ ! ధర్మమేమాయె ధూ

ర్జటి రూపా ? వర చంద్రశేఖర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా ! 37

[స్వామీ ! అదేమో గానీ ప్రస్తుత వాతావరణాన్ని తలచుకుంటే తల తిరిగిపోతుంది. ఎక్కడ చూచినా యథేచ్ఛగా సాగుతూన్న మాన భంగాలు, వరకట్న బాధితలు, వరకట్నపు చావులు, ఒకరి నొకరు హింసింప జూచే ప్రజా సమూహం. ఇదీ నేటి ప్రపంచం! ధర్మ సంరక్షణార్థం అవతరించిన ఓ స్వామీ ! ఇప్పుడా ధర్మం ఎక్కడుందో, ఏమైపోయిందో అంతు పట్టకుండా వుంది గదా !]

Swamy ! If we guage the present atmosphere we find everywhere (a) Modesty and Chastity of women being marred (b) Dowry suffers (c) Deaths due to dowries (d) People giving untold troubles to each other etc., This has been the order of the days, your Holiness have the best motto protect the "Dharma". But to my astonishment as to where the so called "Dharmam" has gone and what has happened to it, I could not make out.

* * *

స్వామీ ! స్వార్థమె యెందుc జూచినను

స్వేచ్ఛా మార్గ సంచారియై

కామోన్ముద్రితమై కనం బడెడు

నిక్కాలంబునన్‌ త్వాదృశ

స్వాముల్‌ గావలె బోధనా పటిమతో

సన్మార్గముం జెప్పి స -

ర్వామోదం బిడc జంద్రశేఖర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా ! 38

[స్వామీ ! ఎక్కడ చూచినా స్వార్థమే పడగలు విప్పి యథేచ్ఛా విహారం చేస్తున్న ఈ కాలంలో ప్రతి ఒక్కరూ తమ తమ లక్ష్యాలను గుర్తించడానిగ్గాను సరియైన జ్ఞానబోధ చేసే అధికారం కలిగిన మీ వంటి స్వాములు ఎందరైనా కావాలి.]

Swamijee ! This Land or World requires more persons of your Calibre, because we find so many persons of selfish nature wherever we go. In such a time, person of your type should make people understand the goal of each individual, to attain eternal happiness.

* * *

ఎంతో శ్రేష్ఠము భూతలమ్ము గనినన్‌

ఈరేడు లోకాలలో

జంతుల్‌ పెక్కిటc దాను మానవుడుగా

జన్మించుటే పుణ్యమౌ

నంతం బోక పరాత్పరున్‌ మనములో

నర్చించుటే ధన్యతా

క్రాంతంబౌ వర చంద్రశేఖర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా ! 39

[ఓ స్వామీ ! పదునాలుగు లోకాల్లో భూలోకమే చాలా శ్రేష్ఠమైనది. 84 లక్షల జీవరాసుల్లో మానవుడుగా పుట్టడం సుకృత విశేషం. అందులోనూ కర్మభూమియైన ఈ భరత ఖండంలో జన్మించడం ఎంతో అదృష్టం. ఇంతటితో ఆగక జీవితాంతమూ పరాత్పరుడైన ఆ భగవంతుణ్ణ ఆరాధించడం జన్మను ధన్యం చేసుకొనే పరమోత్కృష్టమైన కార్యం. ఇలాంటి పుణ్యమూర్తులు మీరే గదా !]

Oh ! Swamyjee ! Permit me to state- This "Bhoolokam" is the best one amongst all the Fourteen Lokas. Amongst 84 Lakhs "Jeevarasis" to have a birth as "Maanava" (human) is more lucky. Even so to have a birth in this "Bharatha Khanda" which is otherwise known as "Karma Bhoomi" is of more high Calibre. After taking birth in such a "Punya Bhoomi" one should not stop at that, he should till in end go on praying the Lord of Lords with sincere devotion and make his life worthy. I am ready to state with no reservation or doubt, your Holiness is such a "Punya Murthy" !

* * *

ఘన మీ భారత పుణ్యభూమి పయి

జోకం బుట్టcగా దేవతా

జనముం గోరుదు రేలొకో తెలియ

సాక్షా చ్ఛాంభవం బైన మూ

ర్తిని మీ బోటి తపోధనుల్‌

భరత ధాత్రిన్‌ ధర్మ రక్షాతి చిం

తనులై యుండుటె - చంద్రశేఖర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా ! 40

[పవిత్రమైన ఈ భారత పుణ్యభూమిలో జన్మించడాని కోసం దేవతలంతా ఉవ్విళ్ళూరుతారట. ఎందుకో తెలుసా స్వామీ ! ధర్మరక్షణ దీక్షాతత్పరులై, సాక్షాత్‌ శివావతారులై మీ వంటి తపోధనులు వెలసియుండటం చేతనే సుమా !]

Swamijee ! It appears that the "Devathas" are anxious with zeal to have a birth in this sacred "Baratha" earth. Why so Swamijee-do you know? The very fact is that persons like yourself who are wedded to protect "Dharma Deeksha" and the very incoronation of Lord Siva having treasure of "Thapas" are adoring the world.

* * *

ఘన వృక్షంబు ప్రవాహ వేగమున

వీకం బోవుచున్‌ వెంబడిన్‌

దనపైc బక్షుల వేలు వందలుగ

శ్రాంతం బొందకన్‌ మోయు రీ

తిని - దేహంబును దాల్చి

భక్త తతి నెంతే మోక్షమార్గాను వ

ర్తనులం జేయరె ! చంద్రశేఖర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా ! 41

[ఒక పెద్ద వృక్షం ప్రవాహంలో బడి వేగంగా కొట్టుకొని పోతూ వుంటే దానిమీద ఎన్నో వందల వేల పక్షులు హాయిగా కూర్చొని ప్రయాణిస్తూ వుంటాయి. అలాగే కర్మవశాత్తు దేహధారులైన మీరు కాలి నడకన యావద్దేశం పరిభ్రమిస్తూ భక్తజనులకు మోక్ష మార్గాన్ని బోధిస్తారు గదా !]

Swamijee ! Your Holiness are blessing your disciples on your way while on "Pad Yatra" and preach them the way to liberation, just as thousands of birds would sit and travel on big log of a huge tree while being the floods of water. This is a marvel of marvels.

* * *

సమయ స్ఫూర్తిగ దేవుc గూర్చి

పటు వాచా నైపుణోద్దాము ల

త్యమలోదాత్త మనీషతో

వర కథా హ్లాదోక్తితో లోకుల&

దమతోc ద్రిప్పుటె గాని -

మీ వలెc గడు& మౌనస్థితి& బ్రహ్మ వి

త్తములం జేయరు - చంద్రశేఖర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా ! 41

[స్వామీ ! చాలా మంది ఉపన్యాస కేసరు లున్నారు. స్వాము లున్నారు. చక్కని వక్త లున్నారు. వీరు చేస్తున్న దంతా ఏమిటి ? చక్కని వాక్చాతుర్యంతో, హాస్యోక్తులతో లోకులనందరినీ తమతో బాటు త్రిప్పించుకొంటారే గాని మీ లాగా మౌన ముద్రతో బ్రహ్మజ్ఞాన సంపన్నుల్ని చేయcజాలరు గదా !]

There are so many stalwarts who give lectures. There are also Swamijees for that master. There are good orators. They are doing harm to the public in attaining the mob with lofty wordings with humourous quotations and drag them towards pit. All cannot come to your level as your Holiness are embodiment of "Bramha Gnanam" with sound mind and say little which is so sweet and fetch real comfort.

* * *

ఒకc డే కార్య మొనర్చెనో

మఱియc దానొక్కండు తానేమి సే

యక యున్నాడనొ - అన్య కార్య

కు విమర్శాలస్య తత్త్వంబు - జీ

వికి మేల్లాదనరే - స్వకార్య గతిపై

విశ్వాసముం బూనుc డం

చకలంక స్థితిc జంద్రశేఖర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా ! 43

[వాడేం చేశాడు ? వీడేం చేశాడు ? ఫలానా వాడు తా నేమీ చెయ్యకుండా వున్నాడు - అంటూ ఎప్పుడూ ఇతరులను చెడుగా విమర్శించడం జీవికి సుఖప్రదం కాదనీ, అలా విమర్శ చేసేముందు తానేం చేస్తున్నదీ త్రికరణ శుద్ధిగా ఆత్మ విమర్శ చేసుకొమ్మనీ ప్రతి సభలోనూ మీరు నొక్కి వక్కాణిస్తూ వుంటారు గదా !]

You have been impreaching people in every gathering to give up the habit of criticising others, and on the alternative stress advising the devotees to gauge onself with inner sense as to what good work to the benefit of the public he or she was done with all sincerity.

* * *

మీ పూర్వాశ్రమ బాల్యముం దెలియ

స్వామీ! యక్కజం బబ్బు - ప్ర

జ్ఞా పాండిత్య విశేషము ల్గనిన

నాశ్చర్యమ్ము వాటిల్లు - వి

ద్యా పూర్ణత్వముc గన్నచో

మది యమం దానందముం బొందు - సం

తాప ధ్వంసక! చంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 44

[సన్యాసం స్వీకరించడానికి ముందు బాల్యదశలో మీరు ప్రదర్శించిన ఏక సంథా గ్రాహిత్వం, ఆంగ్ల భాషా పాండిత్యం, సకల విద్యా కుశలత ఆశ్చర్యాన్ని కల్గిస్తాయి.]

శ్రీ స్వామివారు 9వ తరగతి చదివే రోజుల్లో తమ 12 సం||ల వయస్సులో షేక్స్‌పియర్‌ రచించిన ''కింగ్‌ జాన్‌'' - అను నాటక ప్రదర్శనలో అతి ముఖ్యమైన యువరాజు ''ఆర్థర్‌'' పాత్రను కేవలం రెండు రోజుల రిహార్సల్స్‌లోనే చక్కని ఆంగ్లోచ్ఛారణా దక్షతతో, నటనా కౌశలంతో ప్రేక్షక జన శ్లాఘా పాత్రంగా నిర్వహించి విదేశీయుల మెప్పును సైతం పొందారు.

Oh ! Swamyji ! Before attaining "Sanyasa" your Holiness as a lad, have shown to the people that you would adore the Holy and sacred "Kanchi Kamakoti Peetam" by your quick and instant grasping power and have became Master in English and a big Educationalist ! This is very rare and wonder of wonders. [You have won the lovers and admires from great learned foreigners, as the Master of English language by taking the role of "Arthor" and enacted in the drama written by great William Shakespeare known as "King John", only after taking rehearsal for short period of two days, and you have proved your ability by rightly nursing the character of "Arthor" through and through. You were only a boy of 12 years then and studying in the 9th class. What a wonder ! This all cannot aspire or loft.]

* * *

ఆరుసం బేర్పడc గామకోటి నుత

పీఠా రోహముం జేసి - స

త్వరమే జీర్ణగతి& వెలార్చు

వర మాతృస్థాన కామాక్షి సుం

దర దేవాలయ ముద్ధరింపవె

తపో ధన్యాత్మ! కుంభాభి షి

క్త రమోల్లాసతc జంద్రశేఖర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా! 45

[పరమ రమణీయములైన దేవళములతో నొప్పారు కాంచీ నగరానికి శ్రీ కామాక్షి అమ్మవారి దేవాలయము నడి బొడ్డు. 1907లో ''స్వామినాథన్‌'' అను మీరు పరమ ప్రామాణికమై ప్రతిష్ఠాకరమైన శ్రీ కంచి కామకోటి పీఠానికి 68వ ఆచార్యులయిన తోడనే అమ్మవారి ఆలయ జీర్ణోద్ధరణ మరియు కుంభాభిషేకాలను ఆత్యాశ్చర్యకరంగా జరిపించారు గదా!]

The Temple of "Sri Kamakshi" situated in Sri Kanchi is a beautiful place in India amongst other fine Temples. "Sri Swaminathan" in your "Poorvasramam" adored the "Sri Kanchi Kamakoti Peetam" at the 68th Acharya in the year 1907. So soon you adored the Holy Peetam. You have done the marvellous renovation work of Sri Kamakshi Temple and performed "Kumbhabhishekam" in a wonderful manner under your patronage and I may say so that this is not an ordinary one.

* * *

ఋత మూర్తుల్‌ గురు లాది శంకరులకు&

హృద్యమ్ముగా సత్కళో

ర్జితము& - శిష్య చతుష్టయా న్విత

వివర్తి& షోడశ స్తంభ సం

భృతము& మండవ మొండు నిల్పరె

గురు శ్రీ పాదుకాన్వీత మా

యతిc గాంచీపురిc జంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 46

[స్వామీ ! మీరు కంచిలో షోడశ (16) స్తంభాలతో అద్భుత శిల్ప కళా నైపుణ్యంతో నిండిన మండపాన్ని నిర్మింపజేశారు. అందులో సత్యమూర్తులైన ఆదిశంకరులు వేదరూపులైన తన నలుగురు శిష్యులతో కూర్చొనివున్నట్లు నేత్ర పర్వమైన రూపాల్ని ప్రతిష్టించారు. అంతే గాకుండా పరమ పవిత్రమైన ఆదిశంకర భగవత్పాదుల శ్రీ పాదుకలను గూడా నిత్యమూ ఎంతో దూరం నుంచి వచ్చిపోయే ముముక్షువుల సందర్శనార్థం ప్రదర్శింప జేస్తున్నారు గదా?]

Swamijee ! Your Holiness have constructed a "Mandapam" having 16 fine pillars full of fine arts which will attract the mob so beautifully. In this "Mandapam" you have installed the great "Audi Sankara" among his four desciples who resumble the four Vedas, and the very look on those idols will be a feast to the eyes ofall. Not only that but you have also preserved and kept the foot-wear [Padukas] of Adi Sankara exhibiting the highest "Padukas" to the benefitof all, who seek liberation. This will induecourse shall be protected monuments.

* * *

శ్రీ కామాక్షికి స్వర్ణహార మొకటిం

జేయించు సంకల్పముం

జోక& జెప్పిన మాత్రc జెన్నపురి వాసుల్‌

తేcగ బంగారు వే

¸° కాసుల్‌ - లలితా సహస్రములతో

నంబా గళంబందు దే

వా కూర్పింపవె - చంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 47

[కంచిలో శ్రీ కామాక్షీదేవికి లలితా సహస్ర నామాలను ఒక్కొక్క కాసులో ఒక్కొక్కటిగా చెక్కించి, వేయి బంగారు కాసుల దండను చేయిస్తే బాగుంటుందని మదరాసులో ఒక సభలో మీరు చెప్పగానే భక్తాదులు వెంట వెంటనే సిద్ధం చేశారు గదా !

దాన్నే ప్రస్తుతం ప్రతి శుక్రవారమూ అభిషేకానంతరం అమ్మవారికి అలంకరింప జేస్తారు.]

Sri Gurujee! Is it not a fact when at Madras your Holiness expressed the desire of adoring Sri Kanchi Kamakshi Devi by a Garland with thousand pure gold coins with one "Nama" in each coin from "Lalitha Sahasra Namavalee". The devotees immediately responded and that garland is even now in the Kanchi Kamakshi Temple adoring the sacred idol of Sri Kamakshi. [Even to this day that garland is being put to Sri Kamakshi Devi every Friday after 'Mahabhishekam' which could be seen by devotees.]

* * *

ధ్రువకీర్తి& గురు శంకరార్యులు

సమారోహించి రెచ్చోట భ

వ్య విధి& భీఠముc గామకోటి నుతము&

ఆరీతి దేశంబున&

వివరింపంగను శంకరాఖ్య మఠముల్‌

పెక్కాయె మీసత్కృపా

లవ లేశంబునc జంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 48

[ఆది శంకరులు కంచిలో అవైదిక మతాన్ని నిర్మూలించి అచ్చటి పండిత ప్రకాండులతో శాస్త్ర చర్చ జరిపి వారి నోడించి ''సర్వజ్ఞ'' పీఠాన్ని అధిష్ఠించారు. ఈ విషయాన్ని లోకానికి ఘనంగా చాటే లక్ష్యంతో కామకోటి పీఠ శంకర మఠాలు దేశమంతా శాఖోప శాఖలుగా విస్తరించాయి. ఇదంతా తమ సంకల్ప ప్రభావమే.]

Sri Gurujee ! Sri Adi Shankara killed the "Avydika" Religion at Kanohi after hot-debate with Pandit-stalwarts and defeated them, and he adored the "Peeta of Sarwagna". The message of Sri Adi Sankara is being spread and taught in the whole Universe by Sri Kanchi Kamakoti Peetam and its branch Mutts every where. These are will-powers of your Holiness.

* * *

అమలోదాత్త మనీష నార్యులగు

పూర్వాచార్యుల న్మించి సం

భ్రమముం గూర్చుచుc బాదయాత్రలను

యావ ద్వేశముం జుట్ట-నజీ

ర్ణములు& ఆర్ష కళాభి రూపములు

నానా దేవళంబుల్‌ భవత్‌

శ్రమతన్‌ శోభిలెc జంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 49

[దృఢ దీక్షతో ఇదివరకూ పూర్వాచార్యు లెవరూ తిరుగని రీతిలో మీరు యావద్భారతాన్నీ యెన్నో సార్లు కాలి నడకన చుట్టారు. తత్ఫలితంగా శిథిల దేవాలయాల్నీ కళా ఖండాల్నీ, స్థల మాహాత్మ్యాలనూ ఎన్నింటినో వెలుగులోకి తెచ్చారు మీరు.]

You have stood the first and fore most among the ancient Cultured Acharyas, by stroling and covering the whole "Bharatha Bhoomi" only on "Pada Yatra" many a time. With the result you have un-earthed and brought to light amongst many, including the delabitated temples, sculptures and old unknown history of so many pilgrim centres.

* * *

కైలాసాభము జంబుకేశ్వరమునం

గాలూని జీర్ణ స్థితి&

గ్రాల& పంచ ముఖేశ్వరాలయము -

దీక్షా దక్షతల్‌ సూపి - శి

ల్పాలంకార విభాసిc జేయరె

యనల్ప ప్రజ్ఞc గుంభాభిషే

కాలంకారతc జంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 50

[అపర కైలాసమైన జంబుకేశ్వరం (తిరువానైక్కావల్‌) లో పంచ ముఖేశ్వరాలయం జీర్ణస్థితిలో వుండగా, 1943 వ సం||లో దాన్ని మీరు దర్శించారు. అక్కడ పెరిగిన చెట్టు చెదారాన్ని తీయించి, ఆ దేవాలయ నిరుపమాన సౌందర్యానికి అబ్బురపడి దాని పునర్నిర్మాణానికి యేర్పాట్లు చేయించి, ఆ సంవత్సరమే కుంభాభిషేకాన్ని గూడా నిర్వహించారు గదా!]

In the year 1943 your Holiness visited the temple of "Pancha Mukheswara" which is an other "Kailasa" at the place of Jambukeswara [now called as "Thiruvanaikkaval" and abserved that the temple was in a ruined condition. Your Holiness repaired by removing all Thorns, hurbs, bushes, made the temple very beautiful and performed the function of "KUMBHABHISHEKAM" in the same year !

* * *

అల గౌరీపతి లేని ఈశుగుడి నా

నా రాయవేలూరిలో

జలకంఠేశ్వర దేవతా యతన

ముచ్చై శ్శిల్ప నైపుణ్య సం

కలితం బొప్పగ - మీదు దివ్యతర

సంకల్ప ప్రభేచ్ఛన్‌ బున

ర్లలితం జేయరె ! చంద్రశేఖర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా! 51

[రాయవేలూరి కోటలో 13 వ శతాబ్దంలో ఆంధ్ర యాదవ రాజులు (బొమ్మిరెడ్డి వంశీయులు) ఎత్తైన గోపురాలతో అనిర్వచనీయమైన శిల్పకళా నైపుణ్యంతో నిర్మించిన శ్రీ జలకంఠేశ్వర దేవాలయం వుంది. అది ముస్లిముల దండయాత్రలవల్ల నైతేనేమి లేక హిందువుల అశ్రద్ధవల్ల నైతేనేమి కొన్ని వందల యేండ్లుగా ''దేవుడు లేని గుడి'' అని పిలిపించుకుంటూ ఎందరినో ఆకర్షిస్తూ వుంటే - ఆ గుడిలో మీరు మరలా అమ్మవారిని, ఈశ్వరుని ప్రతిష్ఠించి, శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామివారి అమృత హస్తాల మీదుగా కనీ వినీ ఎరుగని రీతిలో లక్షలాది భక్త జన సమక్షంలో కుంభాభిషేక మహోత్సవం జరిపించి నిత్యపూజాదికాలతో అలరారేటట్లు గదా!]

There is a big beautiful ancient Temple of "JALAKANTESWARA" at Raya Vellore in the fort built by Andhra Yadava Rajas in 13th Century, with big walls, with fine arts and high variety of skilled sculpture. This temple had been attacked by Muslims in their "Dandayatra" and was distructed or may be the negligence of Hindus it had no proper care for hundreds of years and was branded as "Temple without presiding deity" but inspite of itsciatic condition was still attracting the attention of devotees, what a misery ! Your Holiness are pleased to renovate the temple, installed again the idols of "SRI JALAKANTESWARA". His consent "Sri Parvathi Devi" and complementary idols just as Ganapathi, Basavanna etc., through your Junior Swamijee "Sri Jayendra Saraswathy" and he ordained the installation by his nector like hands, brought the temple into existence and now thousands are visiting the temple. Sri Jayendra Saraswathi Swamijee performed the great "Kumbhabhishekam" to the Lord with grand success which was witnessed by large gathering of Devotees. This goes to the credit of your Holiness !

* * *

ధీ మూర్తుల్‌ గురులాది శంకరులకున్‌

దివ్య స్మృతిన్‌ నిల్పc బ్రో

ద్దా మౌన్నత్య సు శోభితంబును

గళా ధామమ్ము సౌధమ్ము - నే

త్రామోదమ్ముగ నొండు నిల్పరొకొ

మీరా 'కాలడిన్‌' సూరి మే

ధామోదమ్ముగc జంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 52

[ఆది శంకరులకు, వారి జన్మస్థలమైన 'కాలడి'లో దివ్యస్మృతి చిహ్నంగా మహోన్నతమై కళాత్మకమైన ఒక సౌధాన్ని శిల్ప శాస్త్ర ప్రకాండు లంతా చూచి తల లూచే రీతిలో నిర్మింప జేశారు మీరు.]

Your Holiness have done the wonderful work by getting a big and beautiful building in the birth place of "ADI SHANKARA" called "KALADI" to the satisfaction and appreciation of one and all, especially in sculptures and made them all to "Knod" their heads with great reverence. This will ever be green in the History! This is done in commemoration of Sri Sankaracharya. Nay ! This will bring home the very incoronation of Sri Adi Shankara.

* * *

వర శ్రీశైల మహాగ దర్శనమునన్‌

బాతాళ గంగా సరి

ద్వర తీరంబున నాది శంకరులు

పాదం బూని రంచున్‌ మహ

త్తరమౌ మండప మొండు గట్టరొకొ !

అంతంబోక విద్యార్థు లెం

దఱనో తీర్చరె - చంద్రశేఖర యతీంద్రా!

భక్తి ముక్తి ప్రదా! 53

[ఆది శంకరులు శ్రీశైలాన్ని దర్శించి ''సేవే శ్రీ గిరి మల్లికార్జున మహాలింగం శివా లింగితమ్‌''-అంటూ భ్రమరాంబా మల్లికార్జునులను స్తుతించారు. వారి రాకకు స్మృతి చిహ్నంగా ఒక మండపాన్ని మీరు నిర్మించారు. అంతేగాక వేద పాఠశాలను గూడా నడుపుతూ ఎంతో మంది విద్యార్థులను తీర్చి దిద్దారు.]

Sri Adi Sankara during his time visited Sin - holy Sri Sailam and praised Lord Mallikarjuna and Sri Bhramaramba as "Seve Sri Giri Mallikarjuna Maha Lingam Sivaalingitam" in his "STOTRAM". In memory of his visit you have constructed a "Mandapam". Not only that but you have been running a "VEDAPATASALA" and moulder many student desciples at Sri Sailam.

* * *

అకలంక స్థితిc బ్రాతవడ్డ

స్థల మాహాత్మ్యమ్ములన్‌ జూచి - కొం

కక యావద్భరతోర్వి నింత దనుకన్‌

గానంగ రానట్టి పు

ణ్య కథా ప్రాంతములన్‌ బయల్వఱచి

పూజార్హత్వముం గూర్చితే

ప్రకట ప్రాభవ! చంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 54

[స్వామీ! మీరు శ్రమను లెక్క పెట్టకుండా పురాతన గ్రంథాల్లోని స్థల మాహాత్మ్యాలను పరిశీలించి, భారత భూమిలో ఇంతవరకు కానరాకుండా మరుగున బడిన పుణ్య ప్రదేశాలను బయల్వఱచి వాటికి పూజార్హత కల్గించారు గదా!]

Oh ! Swamijee ! You have been able to travel all over Bharatha and have brought out to light so many known sacred places hitherto not known to many and have arranged "Poojas" giving liberally your sacred and worthy guidance. What a fine act ! This people connot forget. This gigantic work you have done after searching old SASTRAS and PURANAS which an ordinary men would not imagine.

* * *

అటులే కాదొకొ కాళహస్తి పురిలో

నజ్ఞాతమై యున్న శ్రీ

నటరా జాఖ్యము రంగ మందిర

మమందానందముం గూర్చుచున్‌

స్ఫుటమౌ పంచముఖాఖ్య బ్రహ్మగుడి

సంశోభించె - మీకీర్తి నేc

డట విభ్రాజిలెc జంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 55

[ఆ విధంగానే మీరు శ్రీ కాళహస్తిలో నటరాజా రంగస్థల మండపాల్ని, అలాగే పంచముఖ బ్రహ్మగుడిని వెలికి తీశారు. మహాత్మా ! మీ కీర్తికి అవి పతాకలుగా నిలిచిపోయాయి గదా!]

Oh ! Gurujee ! In the same manner you have brought out to light "Nataraja Ranga Sthala Mandapam" and the temple of "PANCHA MUKHA BRAMHA" at Sri Kalahasthi. Oh : Mahatma ! They have stood as the simple flag of your reknowned figure personality forever.

* * *

అలరన్‌ మండప మొండు -

శంకరుcడు తా నద్వైత వైరిన్‌ గుమా

రిల భట్టుం గనె నెచ్చటన్‌

విమల వాగ్రీతిన్‌ విడంబించి - యి

మ్ములc దా మండన మిశ్రుc గెల్చెc దుద

నా పుణ్య ప్రయాగన్‌ విని

ర్మల! నిర్మింపవె చంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 56

[ప్రయాగలో - గంగ వొడ్డున ఆదిశంకరులు ప్రఖ్యాత తర్క పండితుడు కుమారిల భట్టును కలుసుకొన్నాడు. కుమారిల భట్టు మండన మిశ్రుని గురువు. ఆదిశంకరులు మండన మిశ్రుని తమ అద్వైత వాదంతోఓడించిన తీరు అందరికీతెలుసు. అందుకని శ్రీస్వాములవారు ఆప్రదేశంలో శంకర విమాన మండపాన్ని 70 లక్షల ఖర్చుతో నిర్మించారు. దీనికి 1986 ఫిబ్రవరిలో ప్రాణ ప్రతిష్ఠ, సంప్రోక్షణ జరిగాయి. (ఈ కార్యక్రమాలకు ఉత్తరప్రదేశ్‌ గవర్నరుగా నున్నపుడు దీనికైస్థలాన్ని కేటాయించిన డా||బెజవాడ గోపాలరెడ్డిగారిని స్వామివారు ప్రత్యేకంగా ఆహ్వానించారు.]

At Prayaga on the banks of Ganga Adi Shankara met a great "TARKA" Pandit by name Kumarila Bhat. This K. Bhat is "Guru" to Mandana Misra. It is a well known fact that how Aadi Sankara defeated Mandana Mishra in Advaita discussions. To mark the victory of Adi Sankara your Holiness have constructed at that place a "Vimana Mandapam" with a cost of Seven Lakhs of Rupees. In the month of Febraury 1986 the installation and Pavithrothsavam took place there. [For this programme Sri Swamijee had invited Sri Bejewada Gopala Reddy in 1986 as a special guest, for he had given the place for construction of the Mandapam, when he was the Governor of Uttar Pradesh.]

* * *

మాలవ్యా మహనీయుc డార్యమతి

సమ్మానించెc గాశిన్‌ మిమున్‌

తూల ప్రాయము లెన్న మీకు నివి -

హిందూ విశ్వ విద్యాలయ

ప్రాలంబంబులె నాటి మీ నుడులు -

గీర్వాణోక్తి లాలిత్య ము

క్తా లోకంబులు చంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 57

[పండిత మదనమోక్షన మాలవ్యా, కాశీ మహారాజులతో గూడి 1934లో వేలాది జన సమూహం ముందు మిమ్ముల్ని ఘనంగా సన్మానించారు. అయ్యఖండ సన్మాన హహా సభా వైభవాన్ని కాశీ పట్టణం కనీ వినీ యెరుగదని ఆనాడు ఎన్నో పత్రికలు ఘోషించాయి. అయినా మీకివి లెక్కలోనివి గావు. తూల ప్రాయాలు.

హిందూ విశ్వ విద్యాలయంతో అధ్యాపక విద్యార్థి సభలో, సంస్కృత భాషలో మీరు చెప్పిన పల్కులు ఆణిముత్యములై నేటికీ ఆదర్శప్రాయంగా నిలిచిపోయాయి.]

Your Holiness was given applauding reception and avation in the big meeting arranged in your honour in the presence of great Pandit Madana Mohan Malavia and Sri Maharaja of Kasi at Benaras City in the year 1934. This very fact has been widely published by many leading Newspapers describing about such function, which was never witnessed and unheard at any time. Though it is so, this is not at all matching to you but it is lightest one in your estimation. It is only cotton that could be po-phoed. The discourse in Sanskrit language has stood as clear crystal even to day, while presenting the lecture by your Holiness in the Auditorium of the Benaras Hindu University before the eminent professors, lecturers including the students.

* * *

మదిలో దేవుని భిన్న భిన్న గతి

సంభావింప సౌఖ్యమ్ము న

య్యది యేమాత్రము నీయcబో దనుచు

మీ రద్వైత వజ్రోత్సవా

స్పదముం జేయరె కాంచికా పురిని -

శశ్వత్‌ జ్ఞప్తికిన్‌ సంచికన్‌

సదయం గూర్పరె! చంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 58

[దేవుణ్ణి రక రకాలుగా భావిస్తే అది యే మాత్రమూ సుఖాన్నివ్వదని - యావద్భారత దేశం నుంచీ పండితులను పిలిపించి కంచిలో అద్వైత వజ్రోత్సవ సభలను జరిపించి, అట్లు జరిగినందులకు గుర్తుగా 'ద్వితీయాద్వై భయం భవతి'-అన్ని వేదోక్తిని వివరిస్తూ, అద్వైతాన్ని బోధిస్తున్న విశేష వ్యాసాలతో ఒక సంచికను గూడా వెలువరించారు మీరు.]

You have sponsored "ADWAITA" philosophy in a such a manner that it will not benefit or give comforts to none, if all thinks the form of God in many ways, and for this very purpose you invited all the learned pandits from all the corners of the country, by arranging a great "SABHA" at Sri Kanchi. Incommemoration of such a gathering you have published a "Souvenir" containing many articles in supporting the doctrine of "Adwaita" quoting the VEDA where is it said "Dwiteeyaa Dwai Bhayam Bhavati" etc.

* * *

మత మేదైనను లక్ష్య మొండెగద -

బ్రహ్మానంద మేకత్వ మం

దతివేలమ్మగc గానcగాc బడెడు

నయ్యా! కీచులాటల్‌ ప్రజా

తతికిన్‌ హానికరమ్ము లంచుc

బటు బాధా తప్త చిత్తమ్ముతోc

బ్రతి భాషింపరె! చంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 59

[మత మేదైనా లక్ష్య మొక్కటే. ఏకత్వాన్ని బోధించే అద్వైతంలోనే అనంతమైన బ్రహ్మానందం వుంది. ''భిన్న విభిన్న ప్రదేశాల్లో పుట్టి పెరిగిన నదులన్నీ ఎలాగా సముద్రంలోనే సంగమిస్తాయో, అలాగా భిన్న విభిన్నమతాల లక్షమంతా గూడా బ్రహ్మానందాన్ని అందుకోవడమే''-అంటూ పుష్పదంతుడు చెప్పిన శివ మహిమ్న స్తోత్రాన్ని ఉదహరిస్తూ, కీచులాటలు మానుకొంలో శ్రీ రామానుజుల జన్మస్థలమైన శ్రీ పెరుంబుదూరునిడ మీరు బాధాత ప్తచిత్తంతో ప్రతిభాషించారు గదా!]

Swamijee ! There may be different religious, but the aim is one and the same. There is uncountable "Bramha Nandam" in the doctrine of "Adwaita" which preaches "Ekatwam". Just as the rivers have birth different places, but will all go and flow into the waters of the sea and congregate in the same, so also all the aims would automatically congregate and achieve "Bramhanandam". Your Holiness would quoted "SIVA MAHIMA STOTRAM" by Sri Puspadantha at Sriperambudur and rightly advised all to shudder or shake of the differences in their doctrines.

* * *

ఈ కర్మావని శైవ వైష్ణవము

లెంతేc బోరుచున్‌ - లక్ష్యముల్‌

వాcకన్‌ ద్రోసి, యగమ్యులై

మెలగుచో ''వాకేశవో వాశివో

ఏకోదేవ''-అటంచుc దెల్పుటకునై

యెన్నో సభల్‌ గూర్ప లే

దా! కర్మణ్యతc జంద్రశేఖర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా! 60

[కర్మభూమియైన ఈ భారతంలో శైవ వైష్ణవ మతాలు రెండూ ఎంతగానో పోరాడుతూ లక్ష్యమేమిలో తెలియకుండా అగమ్యాలై వున్న తరుణంలో - శివుడైనా కేశవుడైనా ఒక్కడే ''ఏకో దేవః కేశవో వా శివో వా'' అన్న విషయాన్ని తెలియజెప్పడానిగ్గాను ఎన్నో సభలను సమావేశాలను ఏర్పాటు చేశారు శ్రీ స్వామివారు.]

Your Holiness are pleased to conven number of "Meetings" to wash away the bitterness in between "S A I V A S" and "VAISHNAVAS" and made it clear in all the meetings that "Siva" and "Keshave" are one and the same with no difference.

* * *

యావద్భారత వేద శిల్ప సభ

యొం డావిర్భ వించెన్‌ భవత్‌

భావానూన గతిన్‌ ఫలార్థ

'మిల యాత్తం కోవెల&' నాడు - వి

ద్యా వర్ధిష్ణులు సత్కళా రతులు

ప్రత్యబ్దంబుc జర్చించి స

ద్భావంబుల్‌ గనc జంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 61

[భిన్న విభిన్న దృక్పథాలతో, సంప్రదాయాలతో సతమత మవుతున్న వేద ధర్మాన్నీ, కళలను ఏకముఖం చేయడానికిగాను 1962 లో 'ఇలయాత్తం గుడి'లో 'అఖిల వ్యాస భరతాగమ శిల్ప సదస్సు'ను ప్రారంభించారు. ఇందులో ప్రతి సంవత్సరమూ దేశం నలుమూలలనుండి కొమ్ములు తిరిగిన పండితులు, కవులు, కళాకారులు మరెందరో ఒక్క వేదికపై చేరి అందరికీ ఆమోద యోగ్యమైన అభిప్రాయాలను రూపొందిస్తున్నారు గదా!]

Oh ! Swamijee ! In the year 1962 at "ELAYATTAM GUDI" you have started one fiine scheme and organised a meeting with the tittle of "Akhila Vyasa Bharathagama Silpa Sadassu" in order to bring home under one banner and opinion by calling people having all paralleled different views, customeries, when "Veda Dharma" has suffered with no point. Right from that year, so many self styled Scholars, Authors, Sculptures, cultured persons are attending the Meeting on a single platform and your Holiness have been shaping the minds to the specific un-alterable decision. This is highly great.

* * *

నానాట& గడు హీనమై మడియు

విజ్ఞాన ప్రదాత్రి& గుణా

నూనం గావరె వేద మాతను

నమందోత్సాహ ముప్పొంగ ప్ర

జ్ఞానార్థంబుగc బాఠశాలలను

ప్రోత్సాహింపరే స్వర్ణ చి

హ్నాన బాలురc జంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 62

[రోజు రోజుకూ అంతరించిపోతున్న జ్ఞాన భాండారమైన వైదిక విద్యను ప్రోత్సహించడానికై ఎన్నో వేద పాఠశాలలను స్థాపించారు మీరు. అంతే గాకుండా ఆయా పాఠశాలల్లో స్వర్ణపతక బహుమతులు గూడ యేర్పాటుచేసి, విద్యార్థుల నెంతగానో ప్రోత్సహిస్తున్నారు.]

Oh ! Swamijee ! When "Vydika Vidya" is vanishing day by day to its rock bottom, you have done the best work of establishing "VEDA PATASALAS" in many places in order to sponsor the Veda Vidya. This is not all and you have arranged Gold Medals for presenting to student of merit in the respective institutions and by this way you are encouraging the students and making them MASTERS or PANDITS. This again is not an ordinary work.

* * *

కల కాలంబున నుండి వీనుల

వినంగా లేని శ్రీ సుప్రభా

త లసద్గానము - కాశి విశ్వ శివు

పాద ధ్యాన లక్ష్యమ్ము - ని

స్తుల దీక్షామతి శ్రీ జయేంద్ర యతి

యుద్ఘోషింపగాc జేసె మీ

తలపుం జేకొని - చంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 63

[కాశీక్షేత్రంలో శ్రీ విశ్వేశ్వర దేవాలయ శిఖరాగ్రం నుండి విశ్వేశ్వర సుప్రభాతం వినిపించబడుతూ వుండి, యెందుచేతనో ప్రస్తుతం చాలా యేండ్లుగా నిలిచిపోయింది. మీ సలహాపై శ్రీ జయేంద్ర సరస్వతీస్వామివారు ఆ సుప్రభాతాన్ని తమ దివ్య సంకల్ప ఇటీవలనే పునరుద్ఘోషింపజేశారు గదా!]

The "SUPRABHATAM" that was being heard from the top of "Sri Kasi Viswesvara Swamy" temple some years ago at "Sri Kasi" the famous pilgrim centre. For reason whatsoever, had obruptly stopped for many years. It was only recently commenced on the advice of your Holiness through your Junior Swamijee Sri Jayendra Saraswathi.

* * *

ఆలోకింప హితైషు లుండినను

దామా పండితుల్‌గారు - వి

ద్యా లాభుల్‌ సుమనీషు లుండినను

క్షేమా కాంక్షులుం గారిలన్‌

మేలుం గోరు బుధుల్‌ లభించుట

కడున్‌ మేలిచ్చు తీపైన మం

దై లాభించెడు జంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 64

[ఈ లోకంలో మేలుగోరేవా రుంటారు గానీ వారు పండితులైయుండక పోవచ్చు. పండిత ప్రకాండు లుండవచ్చు గానీ మేలుగోరేవారు కాకపోవచ్చు - అయితే పాండిత్యమూ గల్గి మనసారా మన మేలుగోరే బుధులు లభించడం-తియ్యగా వుండి చక్కని గుణాన్నిచ్చే ఔషధం చేతిలో వున్నట్టే సుమా!]

Swamy ! In this world there may be well-wishers, but not "Pandits". There may be "Pandits" but not well-wishers. Out of the two if there is a Pandit with well wishing nature is available, this will be so much good like a medicine having good quality of removing sick ailment added with sweet on hand.

* * *

తలపంగా మసి గూడు విశ్వ

మయినన్‌ - దర్కింపcగా దీనిలో

పలికిం జొచ్చియు మైల సోకని గతిన్‌

బారాడి తా నెవ్వc

ర్మిలి బైటం బడు దేవదేవు కృపచే

మేధావి యాతండె పో

అల మీ రిట్టిరె - చంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 65

[స్వామీ! ఈ ప్రపంచం ఒక మసిగూడు లాంటిదైతే దీని లోపలికి ప్రవేశించి భగవంతుని దయవలన ఎలాంటి మైలా సోకకుండా ఎవడు బైట పడతాడో అతడే మేధావియైనట్లు, ఆలోచిస్తే అలాంటివారు మీరు తప్ప నాకు మరెవ్వరూ కనబడకున్నారు గదా!]

Swamijee ! I find only your Holiness being the "Medhavi" and none else on the earth. Because you have emerged out of danger of re-birth. I think all of us have taken birth in the world which would be compared to a factory chimney coak and come out of the chimney and our bodies are smeared with the black coak, but yourself emerging without any iota of chimney dust or coak. This is wonderful.

* * *

భగవంతుండు కృపా విశేషమతి

శోభల్‌ మీఱు నీమర్త్య జ

న్మ గతిన్‌ దా నొసcగెన్‌ -

గృతార్థుcడతcడే మర్త్యుండు కాలంబు వ్య

ర్థ గతిం బుచ్చక ఆ శివుం దలcచుచున్‌

ధర్మంబులే సేయు స

త్య గతుం డాతcడు - చంద్రశేర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 66

[ఓ స్వామీ? కరుణామూర్తియైన భగవంతుడు శోభాయమానమైన ఈ మానవజన్మ నిచ్చాడు. ఇచ్చినందులకు ఏ మానవుcడైతే అమూల్యమైన కాలాన్ని వ్యర్థం చెయ్యకుండా శివార్పణా బుద్ధితో ధర్మకార్యాలు చేస్తూ సత్యమార్గంలో నడుస్తాడో అతcడు మాత్రమే కృతార్థు డౌతాడు సుమీ!]

Swamijee ! Almighty the God has kindly and gracefully given the form of birth as a human being which is more precious. Being so, any person who has got wisdom would not waste the time and do good things with good sense and activity only with the mind, submitting all to the creator God. Ultimately he would go by the way of truth. So, he only deserves all praises.

* * *

నానా జన్మ కృతాపరాధిని

దురంతంబైన కర్మాన్వితం

బై నా దేహము కల్గెcబో,

నఖ శిఖా పర్యంతమౌ దుర్వికా

రానూనంబుగ - నాకు నిష్కృతి

దలిర్పం జూడుమో స్వామి - ఆ

ర్తానంద ప్రద! చంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 67

[ఓ దీనదయాళూ ! నానా జన్మల్లో చేసిన కర్మఫలితంగా నా కీదేహం వచ్చింది. ఇదెలాంటిది? నఖ శిఖ పర్యంతమూ గూడా అనుక్షణం మార్పుచెందే స్వభావం కల్గినట్టిది. ఎన్నో దుర్వికారాలకు నిలయమైనట్టిది. ఇటువంటి దేహధారినైన నాకు జన్మ తరించే మార్గం చూపించలేవా స్వామీ!]

Oh ! Swamijee ! You are saving many with your good grace. I submit that after having so many births in many forms I am born as a man now. This body is having so many ambitions from top to bottom and having no sound mind. This is subject to many bad thoughts. I pray your Holiness to show the good way to "LIBERATION".

* * *

పటు దేహంబను సౌధ మిద్ది

తిలకింపన్‌ వజ్ర వైడూర్య సం

స్ఫుటమై లక్షల కెక్కుడౌ విలువతో

శోభిల్లు - మూన్నాళ్ళ ము

చ్చట పో అంతయు - దీని నెంచక

వృధాశాపాశ బద్ధుండు తా

నటియించుం గద - చంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 68

[స్వామీ! వజ్ర వైడూర్యాలతో పొదగబడి లక్షల కెక్కుడు విలువచేసే సౌధంలాగా ఈ దేహం అమూల్యమై ప్రకాశిస్తోంది. అయితే ఇదంతా మూన్నాళ్ళ ముచ్చటే సుమా! దీన్ని గ్రహించలేక వ్యర్థమైన ఆశాపాశ బంధాల్లో తగుల్కొని జీవుడు నిజ జీవితంలో నటిస్తూ వుంటాడు గదా!]

Swamy ! The so called "JEEVA" will have high thoughts of ambitions through air, through his life time finding no end to his wantings. He will be acting only with that. This is wonder of wonders. He thinks though his body is subject to fall with no life which is uncertain. That it is more precious and takes it to be a fine house built with so many precious stones of high value.

* * *

మదిc దా నెంచిన వెల్లc దీర్చుకొనcగా

మర్త్యుం డశక్తుండు - దు

ర్విధి యిట్టట్టుల లాగు నాతనిని

నార్తిం గూర్చెడిన్‌ సర్వ సం

పదలున్‌ బంధు గణమ్ము సంతతియు

శ్రీ మాహేశ్వర ధ్యాన ము

ద్ర దిగుల్‌ వాపెడుc జంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 69

[మానవుడు తన ఊహలన్నీ నెరవేర్చుకో లేడు. దుర్విధి అతణ్ణి ఇటూ అటూ లాగుతుంటుంది. సకల సంపదలూ, బంధువర్గమూ, సంతానమూ అంతా కూడా బాధాకరమే, ఒక్క శివధ్యానం మాత్రమే శాశ్వత సుఖాన్నిచ్చి ఓదారుస్తుంది.]

Swamy ! Man cannot be able to fulfill all his ambitions. The mis-fortune will be rocking him hither and thither. Having all the wealth, relatives, having children- everything is also not good. Ultimately only meditation on God will provide soothing peace to him.

* * *

కరమిద్ధాత్రిని సాధు సంపద

మహా కార్యార్థమై సార్థమౌ

నరయన్‌ దుష్ట ధనాళి యెల్లc

గుజనా హ్లాదార్థమై వ్యర్థమౌ

కరణిన్‌ మామిడిపండ్లు చిల్కల కగున్‌ -

కాకాళి తా వేప పం

డ్ల రసం బానెడుc జంద్రశేఖర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా! 70

[ఓ స్వామీ! ఈ ప్రపంచంలో మంచివాళ్ళ ధనమంతా మంచి మంచి పనులకోసం ఖర్చుపెట్టబడి సార్థక మవుతుంది. దుర్మార్గుల ధనమంతా చెడు కార్యాలకోసం వెచ్చింబడి వ్యర్థమౌతుంది. అది సహజమే. తియ్యమామిడి పండ్లను చిలుకలు తింటాయి. చేదు వేపపండ్లను కాకులు తింటాయి గదా !]

Swamijee ! In this world the money or wealth are being spent in two different ways. Money or wealth of good persons are spent for useful purposes and good cause. Where as money and wealth are spent wastefully for useless and bad causes by persons of bad qualities. This is natural. I submit here that the parrot would eat sweet riped mango fruits. Where as the crow would only prefer eating the fruits of Mangrove tree. Is it not so ?

* * *

భువి లోక వ్యవహార దక్షతలు

నెప్డున్‌ దేహ ప్రాణంద్రియా

ది వికారంబులు నంత కంతకును

సందీపించు దుఃఖాశి - లే

దవు సౌఖ్యంబది - పుత్త్ర దార గతమౌ

నాశాదు లెల్లన్‌ వృథా

అవలోకింపcc జంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 71

[స్వామీ! ఈ లోకంలో లౌకిక వ్యవహార దక్షతలూ, దేహ ప్రాణ ఇంద్రియాదుల మార్పులూ క్షణ క్షణానికీ దుఃఖ కారణాలే అవుతున్నాయి తప్పిస్తే దీనివల్ల సుఖం కించిత్తు గూడా లేకుండా వుంది. తన దేహమే ఇలా వుంటే ఇక భార్యాబిడ్డలపైనా, భర్తలపైనా బిడ్డలపైనా ఇలా సంసారపక్షంగా వ్యామోహాన్ని పెంచుకోవడం వృధా ప్రయాస ఔతుంది సుమా?]

Swamy ! In this world persons will be always engaged in day to day work and transactions, by which the body will loose its sturdity and having a thorough change and there by it will increase unhappiness with no pleasantness at all. When it is to have and continue the love on the wife, children, husband and kids will only be a sheerwaste. Is it not so ?

* * *

పులివోలెన్‌ జర వెంట నంటి తరుమున్‌

పూర్ణంబుగాc జుట్టి శ

త్రులునా రోగము లేర్చు దేహమును

నాలో నాయువుం జాఱుc జి

ల్లుల కుండన్‌ స్రవియించు నీరమటు

లీ లోకంబు పాపాత్మతన్‌

దలపంబో డిడి - చంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 72

[ముసలితనం పెద్దపులిలాగా తరుముతుంది. రోగాలు శత్రువుల్లాగా చుట్టుముట్టి దేహాన్ని లోలోపలే పీడిస్తుంటాయి. ఇంతలోపల చిల్లుకుండలో నీరంతా స్రవించేట్లు ఆయువు కాస్తా జారిపోతుంది. కానీ లోకం అజ్ఞానంతో దీన్ని గుర్తించలేకుండా ఈ దేహమే శాశ్వతమనుకుంటూ వుంది గదా!]

Swamy ! The old age will drive a man into weakness like a big tiger. The deseases will trouble inside the body like enemies. In the meantime the time for death will come nearer like the water in a leaky pot emtying slowly. Alas ! The people not knowing this think that the body would last for ever. Is it not so ?

* * *

ఒక సూర్యోదయ మస్తమానములతో

నుత్సాహముం జూపు - నిం

కొక ఋత్వాగమనంబునన్‌ మదిని

నెంతో సంతసంబందు - వే

ఱొక పర్వంబున హాయిగం గడుపు,

ని ట్లొక్కొక్కటిన్‌ ఆయు వం

తకు నాశంబగుc జంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 73

[సూర్యోదయంతో సంతోషిస్తున్నాడు. మానవుడు. అలాగే అస్తమిస్తుంటేనూ ఆనందిస్తున్నాడు. ఒక ఋతువు మారి మరొక ఋతువు (ఉగాది వంటివి) వస్తుంటే, ఒక పండుగ ఒక పబ్బము వస్తుంటే సంబరపడిపోతున్నాడు. కానీ ఒక్క సూర్యోదయంతో, ఒక్క సూర్యాస్తమానంతో ఆయుస్సు జారిపోతూవుందనే నగ్న సత్యాన్ని మాత్రం గుర్తింపలేకున్నాడు గదా!]

Swamy ! Man will be delighted at the dawn of the sun and takes pleasure after the sun-set. So also when change of season occurs and when grand festivals like "UGADI" comes he will rejoice to a great entents. But he totally forgets the open secret that his life period is nearing the end while passing time everyday in and day out.

* * *

జలధిన్‌ భిన్న విభిన్న జన్యములు

కాష్ఠంబుల్‌ జతంగూడి - యి

మ్ములc గాలాను వశంబులై విడుచుc

బోవుం జూడcగా నట్లె - భా

ర్యలు పుత్రుల్‌ మఱి జ్ఞాతులున్‌

ధనములురు అంతంత కాలంబె - ఆ

తలc దా నొక్కcడె చంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 74

[ఎక్కడెక్కడో పుట్టిన కట్టెలు ప్రవాహవేగంతో కొట్టుకొని వచ్చి ఒక్కచోట కలుస్తాయి. కొంత సేపైన తర్వాత చెదరి దేని దారిన అది పోతుంటుంది. అలాగే భార్యా బిడ్డలు, దాయాదులు, ధనములు అంతంత కాలమే వుంటుంటాయి. అవతల మిగిలేది తా నొక్కడే గద స్వామీ!]

Swamy ! So many firewood sticks from different places while being carried away in water floods will meet at one place together. After some time being disturbed will go on its way on different directions. Just in the same manner wife, children, relatives, monies will be with him up to a limit. In the end he is left alone.

* * *

కూడం బెట్టిన వస్తు జాలములు

సంకోచంబు లేకుండగా

జాడల్లేక నశించి పోయెడు -

వృథాశాపాశ బద్ధుండె తాc

జూడన్‌ - యోగములున్‌ వియోగములుగా

శోకంబె పొందించు న

య్యా! డంబంబిది - చంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 75

[ఓ స్వామీ! మానవుడు అజ్ఞానంతో వ్యర్థమైన ఆశాపాశాల్లో తగుల్కొంటున్నాడు గాని, కూడబెట్టిన వస్తువులన్నీ క్రుంగి పోయేవే. సంయోగాలన్నీ వియోగాలుగా మారేవే. ఈ లోక వ్యవహారమంతా డాంబికమే గాని మఱొక్కటి కాదు సుమా!]

Swamy ! The man who has got ambitions will only get himself into trouble. Whatever he will have saved while earning will be sheer waste. All he meets with ambition will only go away from him and nothing will follow him. All the transactions in this world is only a show and nothing but that.

* * *

ధనముల్‌ భూమిని, గోగణంబు లవి

గో స్థానంబున&, భామినీ

మణి తా గేహ ముఖమ్మున&

జన గణంబన్న& స్మశానమ్మున&

జన - దేహమ్ము చితార్పితమ్మగుc

దుది& సత్కర్మ దుష్కర్మలే

అనుభూతమ్ములు - చంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 76

[తాను చనిపోతూనే తన సంపాదన యావత్తూ భూమిలో నిలచి పోతుంది. లేదంటే బ్యాంకుల్లో వుండి పోతుంది. ఆవులన్నీ కొట్టంలో వుంటే అర్ధాంగి గడపల్లో రోదిస్తూంటుంది. పుత్ర పౌత్రుదులు స్మశానందాకా వస్తారు. తనకు మిక్కిలి ప్రియమై తానెంతో ప్రేమతో పెంచి పోషించిన దేహం చితిలో కాలిపోతుంది. చివరంట తనకు అనుభవానికి వచ్చేవి - మంచీ-చెడూ రెండు మాత్రమే సుమా!]

Swamy ! After death of a man all his earned money will fall behind on the earth or it will be in the bank. All the cattle will be in the cattle form. His life partner will be in the house thresh-hold weeping. Sons and grandsons will come up to burial ground. The body which he had so fondly nursed and developed will only be brought into ashes after being burnt. In the end he will take with him nothing while leaving behind his good and bad doings.

* * *

ఒకcడా పేద - మఱొక్కcడేమొ

ధనికుం డొక్కండు రాజన్యుc డిం

కొకcడేమో వర పాండితీ ఘనుcడు -

మృత్యూత్సంగముం జేరc

ల్లకిపై నెక్కినc బాడె నెక్కినను

తుల్యాత్ముల్‌ సుమీ! దీనినే

రక భేదింతురు - చంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 77

[ఒకడు పేదవాడు. మరొకడు కోటీశ్వరుడు. ఇంకొకడురాజ శ్రేష్ఠుcడు. వేరొకడు గొప్ప పండితుడు. మృత్యుదేవత ఒడిలో బడితే పల్లకిపై నెక్కినా, పాడెనెక్కినా సమానమే. ఏ మాత్రమూ తేడా వుండదు. మానవు లీ సత్యాన్ని గుర్తించకుండా అజ్ఞానంలో అంతస్థుల నేర్పఱచుకొని, తర తమ భేదాలతో ఈర్ష్యా సూయలకు లోనవుతుంటా రెందుకు స్వామీ?]

Swamy ! The man does not realise the fast "Death the leveler". One is very poor, one is a millionaire, other is a great King Emperor, still another is great "Pandit". When fell into the jaws of death "septre and crown must tumble down" and all are on the equal level, when death occurs. Man without realising this "truth" would go on creating differences and nursing the spite and fight for the sake of level.

* * *

ఎముకల్‌ బల్బల నెండు కట్టెలటు

లెంతే మండుచోc దోనc గే

శములు& భగ్గను చీపురట్టు లటులే

సంసారముం బోవు - దృ

శ్యము నశ్యమ్మను మాట నిప్పుడయిన&

సత్యం బటం చెంచ - ర

శ్రమతం గోరుచుc జంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 78

[చివరలో చితి మీద ఎముకలు ఎండు కట్టెల్లాగా మండుతుంటే, వెండ్రుకలు పర క్కట్టల్లాగా భగ్గుమంటాయి. దానితో సంసార బంధాలు ఇంకే మాత్రమూ మిగులకుండా పోతాయి. ఇంతా మన కన్నుల యెదుటే జరుగుతున్నా 'ఏది కనిపిస్తూందో అది నశించి పోయేదే' అన్న వేద వాక్యాన్ని నమ్మడు. వాడు పోయాడు - వీడు పోతాడు. ఇలాగా భావిస్తాడు కాని, తానూ ఒకనాడు పోవడం తథ్యమని మాత్రం వూహించడు. అలా వూహిస్తే ఇక ఆ బాధ భరించలేడు - అందుకని ఆ ఊసెత్తడు సుమా!]

Swamijee ! See the wonderful attitude of a man, when he sees a dead body on the pyre, the dead body being burnt, he observes the timbs burning in the dried fire-wood, the hairs becoming ashes withing seconds. With that all his bondage with the femily would goaway. Though all will go without leaving anything before his very eyes, he will not realise the true fact "what is seen will not exist but vanish". This fundamental fact which is clearly said in "Vedas". But he will not believe it. He will only say for himself-"He has gone" "the other person gone". But he does not realise than he will also go on a fine day, should he realises he will not bear than happening-that is why will not rise that topic at all !

* * *

క్రమత& దూరపు బాటసారి

నిజ మార్గం బందు నయ్యైయెడ&

శ్రమముల్‌ వాపcగ నిల్చు రీతి,

జనుc డీ సంసార యాత్రార్థి - గ

ర్భముల& బెక్కులc బుట్టి

కర్మవశుcడౌc - బాండిత్య యుక్తుండు మా

త్రమె ముక్తుండగుc జంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 79

[ఓ స్వామీ! దూర ప్రయాణం చేసే బాటసారి విశ్రాంతి తీసుకోవడానికై అక్కడక్కడా నిలుస్తూ వెళ్ళేటట్లు జీవుడు సంసారమనే యాత్రలో ఎంతో మంది తల్లులు మరియు ఎన్నో జీవరాశుల గర్భాల్లో పుట్టి కర్మ బంధాల్లో తగుల్కొంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అన్నిటా సమదర్శియైన పండితుcడు మాత్రమే సునాయాసంగా ముక్తుడౌతున్నాడు సుమా !]

Swamy ! The so called "JEEVA" will have born in so many forms and had number of mothers and fathers in all his new births. Just as a way father will stop of many places on his way and take rest and so on. In these circumstances a "Pandit" who would see everything on equal footing would easily get himself liberated. Is is not so ?

* * *

పసరంబైనను నీటc బడ్డతఱి

యావచ్ఛక్తులం జూపి నీ

రసతం గాళులc దన్ను బైటcబడ

మర్త్యాంశోద్భవుం డయ్యు - దు

ర్వ్యసనుండై ఘన సంస్కృతిం బడుచుc

బ్రత్యగ్రూపుc జింతింపc డా

త్మ సముత్తీర్ణతc జంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 80

[పశువైనా సరే నీళ్ళల్లో బడ్డప్పుడు శక్తి వంచన లేకుండా బయట బడడాని కోసం కాళ్ళు తన్నుకుంటుంటే - మరి 84 లక్షల జీవరాసుల్లోనూ యుక్తా యుక్త జ్ఞానం కల్గిన మానవుడుగా పుట్టి కూడా, సంసార సముద్రంలో పడ్డవాడు - పైకి రావడానికై భగవంతుణ్ణి ప్రార్థించకున్నాడే - వీడి కంటే ప్రయత్న బలమున్న పశువే మేలు గద స్వామీ !]

When a cattle falls into a deep water is will try to come out of troubled water by kicking with all the four legs and there by it may succeed. Where as a man out of 84 lakhs lot having wisdom falls into the troubled water in she family affairs does not choose to pray God ! So, the cattle which tried to come out of troubled water is far better than the man, who does not even try to come out by praying God! Is it not so ?

* * *

పగలెల్ల& గన వంట యింట -

మఱి శోభల్‌ మీఱగా రాత్రులం

డగ భార్యామణి తోడుత&

బడక టింట& బుచ్చెడి& - జ్ఞాన శూ

న్య గతి& రత్నము గవ్వకోసమయి

తా వ్యర్థంబుగాc జేయు దు

ర్భగు చందంబునc జంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 81

[పగలంతా వంట యింటి ఖర్చుల కోసం (తిండి కోసం) పోరాటం. మఱి రాత్రిళ్ళేమో పడక టింటిలో భార్యామణితో సయ్యాటం. ఇలాగా సంసారమే సర్వంగా అజ్ఞాని, అమూల్యమైన కాలాన్ని దుర్వినియోగం చేస్తూ - ధర్మ సంగ్రహణార్థం భగవంతు డిచ్చిన అనర్ఘమైన దేహరత్నాన్ని లౌకిక సుఖాలనబడే గవ్వల కోసం దుర్భగత్వంలో వ్యర్థం చేస్తూ కాలం వెళ్ళబుచ్చుతున్నారు గదా !]

It is a great pity that men who have good talents and they do not use them for good cause-but instead they are passing the time for getting provisions to have good and tasty dishes in the day time, spending night times with their respective wives, and thus they are only using the worthy body only for false comforts, and making their body and time useless, without thinking of God !

* * *

తరితోc దీరిక గాగc 'బిక్చరు' ల

సందర్శింపc 'బేకాట' లా

డ రుచుల్‌ మెక్కcగ 'హోటలుం'

జొరcబడ& 'టైముండు' గానీ పరా

త్పరు సేవింపcగ దేవళంబునకుc బోవ&

'టైము' లేకుండు - దు

ర్భర మిక్కాలము చంద్రశేఖర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా! 82

[ఓ స్వామీ ! అనుకున్నప్పుడల్లా సినిమాలకు పోవడానికి, పేకాట లాడటానికి, రుచుల కోసం హోటళ్ళు జొరబడానికి టైముంటుంది కానీ, ఆ దేవ దేవుణ్ణి చూడటానికి, గుడికి పోవడానికి మాత్రం టైముండదు. కాలమిలా దుర్భరమై పోయింది సుమా !]

Time has changed among people that they find time to attend Cinemas, attending Clubs with playing cards, entering into hotels for good taste etc., and having no time to visit Holy Temples. This is the order of the day. What a pity it is ? Swamijee ?

* * *

ఋతు హీనాంగికి గర్భ ధారణము

ప్రాపింపంగ లేనట్లు - శ్ర

ద్ధ తనంత& నిలుపంగ లేక

పరమార్థం బబ్బునే? శ్రద్ధయే

ఋతువౌ, బోధయె వీర్యమౌ,

తెలివి భావింపంగ గర్భంబు - హ్లా

తదయే సంతతి - చంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 83

[ఋతుమతి కాని స్త్రీకి గర్భధారణం దుస్సాధ్యమైనట్లు శ్రద్ధలేని వానికి పరమార్థం లభించదు. (శ్రద్ధావాన్‌ లభ##తే జ్ఞానం)

శ్రద్ధయే ఋతువు. గురు బోధయే వీర్యము. జ్ఞానమే గర్భము. బ్రహ్మానందమే సంతానము గదా !]

Swamy ! It is a well known fact that it is impossible for a girl to have the pregnancy before puberty, like wise if there is no interest, he will not have knowledge.

[Interest to learn is maturity - The "Guru Bodha" is vitality, knowledge or Gnanam is pregnancy - Brahmanandam is offspring (SANTANAM).]

* * *

కన - దేహంబొక యింతయేని

నలుగంగాc బోక, స్త్రీ భర్త చెం

తన సౌఖ్యమ్మును గోరెడున్‌ -

ప్రసవ బాధ ల్లేక సత్పుత్రు న

క్కునc జేర్ప& మది నెంచు న్యాయమొకొ ?

ఇక్కోవ& జడాత్ముల్‌ చిరం

తన మోక్షార్థులు - చంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 84

[దేహం సుంతైనా నలుగకుండా భర్తృ సుఖాన్ని వాంఛిస్తుంది. ప్రసవ బాధ లేకుండా కుమారుణ్ణి గుండెలకు హత్తుకోవాలంటుంది. ఏ స్త్రీ కైనా ఇది న్యాయమేనా ? జడాత్ములు గూడా ఇలాగే ఎటువంటి ప్రయత్నమూ చెయ్యకుండా పరమోత్కృష్టమైన మోక్ష పదవిని-సుఖంగా చేరుకోవాలనుకుంటారు గదా !]

Swamy ! Any woman would like to have the mating with her husband but wishes not to have the least pain and then wishes to have a son without labour pain ? Is it ever possible ? Just like, the less learned would crave to have or achieve liberty without any effort. Is it ever possible ?

* * *

ఆవు నజ్ఞానపు లీల లెట్టివొ గదయ్యా!

లోక మెల్ల& శిలా

ళి విలోకించెడు రత్నభావమున -

దృగ్లీలం గను& రక్తమాం

స విశేషంబును మచ్చె కంటిగ -

దురాశన్‌ బంచభూతాత్మ దే

హ విధిన్‌ ఆత్మగc జంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 85

[స్వామీ! ఆజ్ఞానపు లీల లెలాంటిదో చూడండి. దాని ప్రభావంతోనే ఈ లోకం రాళ్ళను రత్నాలుగా ఊహిస్తోంది. రక్తమాంస పిండాన్ని సౌందర్య వంతమైన స్త్రీ మూర్తిగా భ్రమసి దానిపై విపరీతమైన మోహాన్ని పెంచుకొని బంధంలో తగుల్కొంటోంది. మహాత్కృష్టమైన ఆత్మ మరొకటుండగా కేవలం పాంచ భౌతికమైన ఈ దేహాన్నే 'ఆత్మ' (తాను)గా భావిస్తోంది గదా!]

The "ATMA" is seperate from the body. When such being the case, persons who have little knowledge would count the stone pebbles as precious stones like diamond etc., Again he will fall into a pit after seeing a beautiful female. He does not realise that the body of a female is only having blood and flesh. The "ATMA" is far from the human body. But a less learned thinks that his body is "ATMA". Is there any other wonder than this?

* * *

ఏమో జీవి జగమ్ము - సద్గురు కృపా

హీనాత్ము డజ్ఞానియై

గ్రామంబుల్‌ మరి దేశ దేశములు

పారం జుట్టుచున్‌ - వీcపునం

దేమో చక్కెర మోసి -

గడ్డి దిను నా ఎద్దేమొ నా - విభ్రమో

ద్దాముండౌc గద! చంద్రశేఖర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా! 86

[కర్మవశుడైన జీవుడు తాను తరించడానికి సద్గురువును సేవించి ఆయన దయను పొందకుండా, అజ్ఞానంతో యాత్రార్థియై వీపుతో నేమో చక్కెర మోసి, గడ్డి తినే ఎద్దులాగా దేశ దేశాలూ సంచరిస్తూ భ్రమలో పడిపోతున్నాడు గదా !]

What a pity it is to a human man born as "KARMA PASU" on the earth, who would not have the fortune of blessings of "SADGURU" after serving with all devotion, but chooses to shoulder the sugar base on its back as a bull, which is only destined to eat grass, and the so called "Karma Pasu" [Man] would go on from place to place thinking that he is on pilgrimage. He will not derive happiness of liberty without the blessings of "SADGURU".

* * *

అవురా! సాధువు గాగ మాఱు టనినన్‌

ఔన్నత్య ఖర్జూర వృ

క్ష వరారోహణ రీతియే సుమి !

కడున్‌ గష్టించి తానెక్కెనా

చవిc జూచుంగద స్వాదు సత్ఫలములన్‌

జార్పాటు తా నొందెనా

అవనిన్‌ నుగ్గగుc జంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 87

[సన్న్యాసిగా మారటమంటే ఎగతాళి కాదు. ఎత్తైన ఖర్జూరపు చెట్టు నెక్కడం లాంటిదే. అతి జాగ్రత్తగా కష్టపడి ఎక్కేడా తియ్యని పండ్లు చవి చూస్తాడు. అనవధానంతో పట్టు తప్పాడా అవనిలో బడి నుగ్గు నుగ్గైపోతాడు.]

Swamy ! It is not an easy joke to attain the position of "Parama Hamsa" Sanyasin ! It is just like climbing the largest "KHARJURA" tree in desert. If one successfully climbs the tree with all care, he would eat and relish the sweet fruits. If he fails with no practice he would fall and break his limbs.

* * *

పరమౌ సద్గురు జ్ఞాన బాణ ముఖ

సం స్పర్శా విశేష స్థితిన్‌

తురగో ద్రేకము లింద్రియమ్ము లట

నెంతో సంయమం బందుటన్‌

వర శిష్యుండట మూక¸°

బధిరుడౌ పంగ్వంగి¸° పిచ్చి¸°

దరహాస స్ఫుర! చంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 88

[ఓ స్వామీ! సద్గురు బోధ అనే బాణం శిష్యుడికి తగిలీ తగలటంతోటే అశ్వాల్లాగా ఉద్రేకంతో దౌడు లంకించే ఇంద్రియాలు సంయమిస్తాయి. అప్పుడా శిష్యుడు ఇంద్రియార్థాల (రూప రస శబ్ద స్పర్శ గంధాదుల) పట్ల విముఖుడౌతాడు. ఫలితంగా మూకగా, చెవిటిగా, కుంటిగా, పిచ్చిగా-దర్శన మిస్తాడు. ఈరీయ జ్ఞానం కలగడానికి ఇలాంటి దశ సంకేత మంటారు గదా !]

Swamy ! The wonder of wonders is so soon a desciple is shot with an arrow of good teachings by a "Sad Guru" all the sensible parts of the desciple would be brought under control instead of a horse after reserving whipping from its master would gall-up. Then there will be a through change in the desciple and would not crave for false comforts. With the result he would keep himself aloof from the public and looks like, a dumb, a deaf, a lame or a fool in the eyes of on-lookers. This state of being is the mark for attaining the much needed "GNANAM" and he will attain liberty-it not so?

* * *

లలిc దా పండిన పండు

తా నెపుడు నేలం గూలునో యంచు భీ

తిలు రీతిన్‌ - జనియించు జీవి

మరణోద్భీతిన్‌ విడంబించు - ని

చ్చలు - నైనన్‌ దృఢ చిత్తుcడై

ధన గతాశల్‌ మాని - బ్రహ్మమ్మె ని

ర్మల మంచెంచcడు - చంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 89

[ఓ స్వామీ! పండిన పండు నేల బడడం తప్పని సరి. దానికి పతన భీతి యెలాగుంటుందో అలాగే - జన్మించిన జీవి గూడా ప్రతి క్షణమూ మరణ భీతితో విడంబిస్తాడు. అలా భయపడుతున్నప్పటికీ ధనం పైనా, సంసారం పైనా మోహాన్ని విడిచిపెట్టి శాశ్వత సుఖాన్నిచ్చే - 'బ్రహ్మమం'టే ఏమిటో చింతించకున్నాడు గదా!]

Swamy ! It is al known fact that the fruit which has reached riped stage should fall down. Just like that who ever born will have the fear of death and will be always in fear. Though he will be in that state he does not give up his liking on money and family and can one hope he will think about the "BRAHMA" which will provide permanent place.

* * *

దినముల్‌ బాగుగ లేని యప్డు

తగులున్‌ దెబ్బల్‌ పయిన్‌ దెబ్బలున్‌

వెనువెంటన్‌ - గడిలేని యప్డె

బలమై పీడించెడిన్‌ క్షుత్తు - ని

ర్ధను డైనప్పుడు వైరభావములు

సంప్రాప్తంబులౌc గాల చి

త్రణమే అంతయుc జంద్రశేఖర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా! 90

[కాలం కలసి రాకపోతే దెబ్బల మీద దెబ్బలు వెంట వెంటనే తగుల్తూంటాయి. బువ్వ లేనప్పుడే ఆకలి బలంగా పీడిస్తూంటుంది. ధనం లేనప్పుడే తగాదాలు తలెత్తుతాయి. అంతా కాల చిత్రణమే గద స్వామీ! నిజమే. 'కలిసొచ్చే కాలమొస్తే నడిచొచ్చే బిడ్డ పుడతా'డని పెద్ద లన్నారు గదా !]

Swamijee ! When the good star is not there one will have hit after strokes repeatedly. There will be more appetite when there is no food to eat, when thee is no money on hand one will have more demand notices. All this is due to bad time for a person. When time is good the fortune will knock at his door-is it not so ?

* * *

ఆలోకింపcగ నోర్పుకంటె మఱి

యొండౌ సాధనం బెల్ల లో

కాలన్‌ లే దనపాయి సుమ్మిదియ -

చక్కం ద్రుంచెడిన్‌ వైరి నీ

రాళిన్‌ - భవ్య మహా ఫలం బొసcగుc -

దా రాబోవు కాలంబునన్‌

జాలన్‌ మేలిడుc జంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 91

[లోకాలన్నీ గాలించినా ఓర్పును మించిన సాధనం లేదు. ఇది అపాయ రహితం. శత్రువుల్ని సునాయాసంగా మట్టు పెడుతుంది. పుణ్య ఫలాన్ని ప్రసాదిస్తుంది. ఒక అవమానాన్ని గానీ, కష్టాన్ని గానీ ఓర్చుకోవడం మొదట్లో కష్టంగా వుంటుంది. అయితే అదే భవిష్యత్తులో ఊహించని సుఖాన్నిస్తుంది. (యత్తదగ్రే విషమివ పరిణామేమృథోపమమ్‌-గీత) అందుకే పెద్దలు ఓర్చుకుంటే ఓరుగల్లు (ఒకే ఒక రాయైనా సరే) పట్టణమౌతుం దన్నారు.]

Swamy ! Wherever we go and search there is no match to that of perseverance. If one were to have this quality-this is free from danger. This will keep enemies away and bring home peace. This will yield the good fruits in the long run conducting oneself with contented peace is the highest quality. Be it so - keeping calm when offended, to face un-told troubles will be difficult in the first instance. But it will give much more happiness in the future life. That is why elders have said If one has endurance power. Even one big stone will become a town or city. Is it not so ?

* * *

ఈ లోకంబునc గష్టమున్‌ సుఖముc

దా నెవ్వండుc గల్పింపcగాc

జాలం డన్యుc డొసంగునం చనుట

అజ్ఞానంబ¸° - నెల్ల కా

ర్యాల న్నేన యొనర్చుచుంటి ననినన్‌

వ్యర్థాఖి మానంబ - క

ర్మాలంబం బిది - చంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 92

[ఓ స్వామీ! జీవికి ఈ లోకంలో కష్టాలు గానీ సుఖాలు గానీ ఎవరి వల్లా రావడం లేదు. వేరే వారి వల్ల అవి మనకు కల్గుతున్నా యనుకోవటం కేవలం అజ్ఞానం. అలాగే అన్ని పనులకూ తానే కర్త ననుకోవడం వృథాభిమాన మనబడుతుంది. ఇంతకూ బాగా ఆలోచిస్తే ఈ దేహం పురాకృత కర్మాలను అనుభవించడానికి ఒక ఆలంబనంగా వున్నదనడం మాత్రమే సత్యము సుమా !]

The fact that a man has born to have the ups and downs in the life is due to re-birth and that he has to eat the food he will have prepared in his previous birth is really correct. When he gets trouble he will attribute those to others is an utterly false one. Is it not so ? Swamijee !

* * *

తుడువన్‌ పోదు పురాకృతమ్ము

జగతీ స్తోమమ్ములం దెల్లc బెం

వడరం జుట్టిన మాసి పోదు

కన వ్యర్థాయాసమౌ - నేcడు శ్రీ

శుcడె దిక్కంచును ధర్మబుధ్ది

గురు శుశ్రూషాఢ్యుcడౌc జూడ - నా

cడె నిష్కర్ముcడు చంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 93

[ఓ స్వామీ! పురాకృతం తుడిస్తేపోదు. లోకాలన్నీ చుట్టివచ్చినా సరే మాసి పోయేది కాదు. పైగా అలా పరిభ్రమించడం వ్యర్థాయాసమే అవుతుంది. అలా కాకుండా ఎవడైతే శివకేశవులలో నెవరినైనా సరే 'నీవే దిక్క'ని నమ్మి గురుశుశ్రూష చేసుకుంటూవుంటాడో, అతడు మాత్రమే కర్మబంధాల్ని తొలగించుకుంటాడు సుమా !

అందుకే ''చేతో చింతయ కేశవం భజ మన శ్శ్రీ పార్వతీ వల్లభం'' - అన్నది ముకుందమాల.]

Gurujee ! What good or bad we have brought forward from our previous birth we must undergo. It cannot be wiped out. If we go round the world that will not do on the other hand it will be on exhaustion and waste one. Instead of doing so, if we sincerely devote the time by meditating and pray for the merey of God-be it on Kesava on Siva through "Guruseva" he is sure to attain "LIBERATION".

* * *

పాపం బెంతకు నాశ మొందదొ

తలంపన్‌ గార్య సంసిద్ధి సం

తాప ధ్వంసక ! అంతకుం గలుగునే?

తర్కింప నడ్డంకులే

రూపించున్‌ - శివు భక్తిc గొల్చినను

నీ రూపంబులై విఘ్నముల్‌

తాపం బార్చెడు జంద్రశేఖర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా ! 94

[పాపం నశించే వరకూ కార్య సాఫల్యం కలుగదు పైగా అన్నీ అటంకాలే తారసిల్లుతాయి. భక్తితో పరమ శివుణ్ణి సేవిస్తే విఘ్నాలన్నీ గాలికి మబ్బుతెరల్లాగా పటాపంచలౌతాయి. తాపాలు వాటంతటవే తొలగిపోతాయి.]

Swamijee ! The fact being unless the sin finds its end, nothing will be achieved. Adding to this there will be al kinds of hurdles on the way of success. If one were to serve Sri Parama Siva with sincere devotion all the obstacles will vanish in the air just as the cloudy dark will vanish so soon sunrises in the down. Any ailments or anxiety would go away on the irown accord.

* * *

వనమం దైన రణంబునం దయిన

దుర్వారారి మధ్యంబు నం

దును వైశ్వాసర మధ్యమం దయిననున్‌

దోయంబుసందైన - న

వ్యనధిన్‌ - బర్వత మస్తకంబునను -

సుప్తావస్థలం గాచుc బ్రా

క్తన పుణ్యంబులె - చంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 95

[స్వామీ! అడవిలో వున్నా, యుద్ధంలో వున్నా, వ్యూహ మధ్యంలో వున్నా, అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నా, బావుల్లో నదుల్లో పడినా లేక సముద్ర మధ్యంలో తగుల్కొన్నా, పర్వతాగ్రం పైనే వున్నా లేక గాఢ నిద్రావస్థలో వున్నా సరే- అతఃపూర్వం ఆ క్షణం వరకు మనం చేసిన పుణ్యాలే మనల్ని రక్షిస్తాయి గాని - వేరే యేదీ కాపాడబోదు గదా.]

Swamijee ! Our good owings during our post birth will only come to our rescue even where we are in distress-though we be in a wild forest, war field, in the midst of danger, in the fire accident, had fallen into a well, river or deserted in the middle of the sea, or be on the peak of hills, or for that master in good sound sleep-at al these stages only the good we have done during the present birth and post birth, and none the other would come to our rescue.

* * *

భగవచ్ఛక్తి యదేమొ యంచుc

గుజనుల్‌ భాషింత్రు - నేత్రాద్భుత

మ్ముగ దేవుం డొక వీర్య బిందువున

స్త్రీ పుం రూపముల్‌ సృష్టి సే

సెc గదా! చేయుచుc గూడ నుండెcగరు!

యీ చెవ్వాకు లవ్వాకులే

ల? గణింపంగను - చంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 96

[ఓ స్వామీ! ఏమి దేవుడో ఏమో! అంటూ దైవశక్తిని అల్పంగా అంచనా వేస్తారు కొందరు. ఒకే ఒక వీర్య బిందువులోంచీ నేత్రాత్భుతంగా ఇటు స్త్రీ రూపాన్నీ-అటు పురుష రూపాన్నీ భగవంతుడు సృష్టిచేశాడే ఇంకా చేస్తూ గూడా వున్నాడే. ప్రత్యక్ష ప్రమాణం ఇలా వుండగా అనుమాన ప్రమాణాలతో ఈ వ్యర్థ ప్రసంగా లెందుకో మరి.]

Swamijee ! There are many who would go on remarking and under - estimating the power of Sri Bhagavan with little and narrow mindedness. God has created and still creating man and woman pleasing the eyes of criticisers-from out of one drop of vitality. They do not understand the way of creation of God and utterly fail in finding out the real reason. This simple example would do, about the supremacy of the God. Why al the fuss ?

* * *

నానాటన్‌ బరమాణు శాస్త్ర

గహ నానం దాత్ముcడై - శాస్త్ర వి

జ్ఞానా ఖండుcడ నంచుc, బార్శ్వ జన

హింసా బుద్ధియై - తా నిటన్‌

రానే కారణమో, స్వకీయ జనికిన్‌

లక్ష్యం జదేమో యొకిం

తెననన్‌ నేరcడు - చంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 97

[ఓ స్వామీ! నేటి మానవుడు అతి గహనమైన పరమాణు భేదనం చేస్తున్నాడు. అలా భేదించడం వల్ల వచ్చే పరమాణు శక్తితో ఆటంబాంబులు తయారు చేస్తున్నాడు. ఇంత మాత్రానికే తానొక గొప్ప మేధావి నని విఱ్ఱవీగుతున్నాడు. ఏమీ లాభం? ఈ బాంబుల నేం చేస్తాడతను? ప్రక్కవాడి నెత్తిన వేయాలని సమయం కోసం కాచుకు చూస్తున్నాడే తప్ప-తానీ లోకాని కెందుకొచ్చినట్లు? తానేమి సాధించాల్సివుంది? అన్న విషయాలను సుంతైనా ఆలోచించ లేకున్నారు గదా!]

Swamy ! The man of present time as a Scientist, has found out the atom-bomb which is dangerous to the whole of the world. With only so much research, he thinks that he is a great intellect. What is the benefit? What will he do with that? He will be only waiting for a fine time to use that on the head of his neighbour. So, evidently he will not think for a moment as to what purpose he is born and what is his achievement in the life time.

* * *

పులిలో నైనను దేవుcడుంట నిజమౌc

బూజింపcగా నేcగ లొ

ట్టలతో మ్రింగు ప్రమాద మేర్పడుట

చూడన్‌ తథ్యమౌ - నట్టులే

ఖలుcడున్‌ తా భగవత్స్వరూపు

డయినన్‌ గావచ్చు - నవ్వాని కా

తల నుండన్వలెc జంద్రశేఖర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా! 98

[స్వామీ! ఆలోచిస్తే పులిలో గూడా దేవుడుండేది నిజమే. అట్లని పూజించడానికి వెళ్తే అది మనల్ని లొట్టలు వేసుకుంటూ మ్రింగేదీ నిజమే. అలాగే దుర్మార్గుడు గూడా భగవదంశ కల్గినవాడే అయినప్పటికీ అతనికి మనం ఆమడ దూరంలో వుండాలి సుమా!]

Swamijee ! If we deeply think on phylosophically there is inner God even in a terrible tiger. But if we go near to it and try to offer "Pooja" it will only eat us and make feast for itself. This is also true. In the same manner we must keep ourselves at a considerable distance from a bad person though there is inner God even in him. Is it not so ?

* * *

గణియింపంగ నణంకువే ఘనమగున్‌

గానీ అహంకారి యొ

య్యన సద్యః క్షణ దూరుcడౌ శివునకున్‌ -

ఆకార మల్పంబె యై

నను దా శర్కర మ్రింగుc జీమ -

గజ మెన్నన్‌ స్థూలమై మట్టిలో

నను జెర్లాడెడు చంద్రశేఖర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా! 99

[ఓ స్వామీ! ఈ లోకంలో అణకువ గలిగి మెలిగేదే గొప్పది. శ్రేయోదాయకం గూడా అంతేగాని అహంకారంతో మిడిసిపడితే ఆ క్షణంలోనే అతడు శివునికి దూరమై పోతాడు. ఆ తర్వాత అతనికి అన్నీ అమంగళాలే దాపురిస్తాయి. నిజమే గదా! ఆకారం అల్పమైనప్పటికీ చీమ చక్కెర తింటుంది. స్థూల దేహమైన ఏనుగేమో అహంకారంతో మట్టి కొట్టుకుంటుంది.]

ఏనుగు ఒకవైపు స్నానం చేస్తూనే మరోవైపు తనపై తానే మట్టి చల్లుకుంటూ వుంటుంది. దీన్నే 'గజస్నానం' అంటారు.

Swamijee ! Is it not a fact if any one were to have orogance and goes on harrasing others he will not be tolerated by any one and even God will be far-away to him. So, it will to be submissive always do good things to get good in return. For this, take the instance of small ant and it will only eat sweet sugar. Where as the Elephant being huge and big, will only throw mud on its body by its tusk or trunk with Orogance.

* * *

ధరలో సజ్జమ లిద్ద ఱొక్కటయినన్‌

తర్కంబు శ్రీ శాంభవీ

వరుపై సాగెడుc జల్లనౌ గతిగc -

బాపాత్ముల్‌ జతంగూడుచో

ఖరముల్‌ రెండును గాళ్ళc దన్నుకొను రేఖన్‌

గల్మషా న్వీతమౌ

దరహాస స్ఫుర! చంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 100

[ఓ స్వామీ! ఇద్దరు సాధువులు కలిస్తే వాళ్ళ సంభాషణ భగవత్సంబంధంగా సాగుతుంది. ఇద్దరు పాపాత్ములు కలిస్తే గాడిద గాడిద చేరినట్లు కాళ్ళ తన్నులు మొదలవుతాయి గదా!]

Oh ! Swamijee ! When two good orthodox-persons meet, there will be discussion about God with pleasure. When two bad characters meet, there will be blows and kickings like two asses. Is it not so ?

* * *

మాటన్‌ గెల్చినవాcడె మానవుcడు -

నిర్మాలిన్యతన్‌ స్వాంతమున్‌

దాట న్నేర్చిన వాcడె వేలుపు -

నిరాస్థన్‌ దృష్టి నిర్జించు స

య్యాటల్‌ నేర్చినవాcడె సాధువు -

చిరంతానంత శాస్త్రార్థ స

త్తాటం కాన్విత! చంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 101

[ఎల్లవేళలా శాస్త్ర చర్చల్లో మునిగి తేలే ఓ స్వామీ! ఎవడైతే మాటను గెలుస్తాడో వాడే మానవుడు. మనసును జయిస్తాడో వాడే వేలుపు. అలాగే అంతర్‌ దృష్టితో ఆత్మను (తనను) తెలుసుకుంటాడో వాడే సాధువు అనబడతాడు గదా!]

Swamijee ! Your Holiness are always immersed or floating in discussing SASTRAS, I submit that, one who fulfils his promises by standing on his very words-he is called man. One who wins the mind he is next God ! One who realises "ATMAN" or fully knows is a "SADHU". It is not so ?

* * *

ఏ పుణ్యాత్ముని చిత్త మెల్లపుడు

బ్రహ్మేచ్ఛాను సంధానమౌ

నా పుణ్యాత్ము కులంబె సత్కులము -

తా నాథన్యుc గన్నట్టి ప్ర

జ్ఞా పూతాత్మ కృతార్థ¸° -

నతని నిష్ఠన్‌ దాల్చుటన్‌ ధాత్రియున్‌

దా పుణ్యాత్మయ- చంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 102

[ఓ స్వామీ ! ఏ పుణ్యాత్ముని చిత్తం బ్రహ్మజ్ఞాన తత్పరమై వుంటుందో అటువంటి పుణ్యాత్ముడు-జన్మించిన కులమే సత్కులం. అలాంటి బిడ్డను గన్న తల్లే కృతార్థురాలు. అట్టివాని జన్మభూమియే ధన్యభూమి.]

Swamy ! Who ever with good qualities is born and his mind will be always on the "BRAHMA GNANAM" that race is the good race. The mother who gives birth to such a person is really a Goddess. The land in which he is born is really a good land.

* * *

జగతిన్‌ సత్య పరత్వమున్‌

మఱియు నిస్వార్థ స్వభావమ్ము - పూ

త గుణోదాత్త విభూతియున్‌

గడు పవిత్రంబైన శీలమ్ము - ని

మ్ముగ నే వానికిc గల్గు - వానిc

ద్రి జగంబుల్‌ గూడినం గూడc జే

యగలే వేమియుc జంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 103

[స్వామీ! ఈ లోకంలో సత్యభాషణం, నిస్వార్థ స్వభావం, సద్గుణాలు, సచ్ఛీలం - ఎవనిలో అయితే వుంటాయో, అలాంటి వాణ్ణి ముల్లోకాలూ ఏకమైనా గూడా ఏమీ చెయ్యలేవు సుమా !]

Swamijee ! I respectfully submit that no super power would do any harm to a person, who has got the splendid qualities like "Speaking truth". "Selfless nature" and "Good Behaviour with good qualities".

* * *

తులువల్‌ ధర్మ పథాను వర్తిc గనినన్‌

దూషింతు రాకాశ వీ

ధుల మాలిన్ము సేయ నుమ్మెడు

మదాంధుం బోలి, ఆ యెcగిలే

తలపై గూలుచు నుమ్ము నాతనికె

వంతల్‌ గూర్చు - వేదాంతి నిం

దల సేయన్నిదె - చంద్రశేఖర యతీంద్రా !

భక్త ముక్తి ప్రదా! 104

[ఆకాశ వీధులను ఎంగిలి చేయడానికై ఉమ్మివేసే మదాంధుడిలాగా కొందరు దుర్మార్గులు ధర్మవర్తనులను జూచి నిందిస్తుంటారు. అయితే యిక్కడ ఆకాశాన్ని ఎంగిలి చేయాలని ఉమ్మిన ఎంగిలి, సరిగ్గా ఉమ్మి నాతని తలపైనే పడుతుందనే విషయం నిదానంగా అనుభవంమీద మాత్రమే గ్రహిస్తాడు. చివరకు బాధ పడతాడు. ఏమి లాభం - వేదాంతులను నిష్కారణంగా నిందిస్తే వచ్చే ఫలితం ఇదే సుమండీ !]

Swamijee ! Some persons who are accustomed to criticise any person who is on "DHARMA MARGA" with all bad languages, which is as good as trying to spit on the sky being below. What a pity ! The persons who spit on the sky being below would forget that spitted matter would fall right on their own heads and they realise the result and feel misory What is the good ? The same will be the result if "Vedatins" are criticised.

* * *

ఏకార్యం బొనరింపc బూనినను

స్వామీ తత్ఫలాపేక్షలే

కా కార్యంబు శివార్పణా మతిని

జోకం జేయు నవ్వానికిన్‌

లేకుండుం గద యెట్టి కష్టములు -

పాలించున్‌ శివుం డాతనిన్‌

బ్రా కామ్యం బిడి - చంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 105

[ఏ కార్యం చెయ్యాలనుకొన్నా ఫలాపేక్ష లేకుండా శివార్పణా భావంతో ఎవడైతే చేస్తాడో అలాంటివానికి ఎటువంటి కష్టాలూ, నష్టాలూ రాకుండా ఆ పరమశివుడే అతణ్ణి పరిపాలిస్తాడు. కోరిన కోరికలన్నీ అనుగ్రహిస్తాడు.]

Oh ! Gurujee ! Any devotee with pure mind, if he were to do any work without aspiring the fruit, does it or tries to do thinking that it will be fruitful with the blessings of Lord Siva, surely he would be guarded by Sri Bhagavan "SIVA" the Lord of Lords, and the work so done yields fruitful result, bringing home the grand success to such a devotee.

* * *

స్వామీ! యేమియుc గోర -

సాధులు దయా స్వాంతుల్‌ ప్రసన్నాత్మతే

జో మూర్తుల్‌ శివ చింతనాతి రతు

లెచ్చో నుందు రచ్చో - జల

స్తోమాంతర్గతమైన చేపవలె

రోజుల్‌ వుచ్చినం జాలు - ని

త్యామోదం బదె - చంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 106

[స్వామీ! ఎక్కడైతే దయార్ద్రహృదయులు, ఆత్మ జ్ఞాన సంపన్నులు, పరమేశ్వర ధ్యాన తత్పరులు వుంటారో అక్కడ - అనంత జలపూర్ణమైన నిర్మల సరస్సులో చేప పిల్లలాగా రోజులు గడిపితే చాలు. ఇంతకు మించి నేనేమీ కోరటం లేదు స్వామీ! ఇదే నాకు నిత్యానందం - మరియూ బ్రహ్మానందం.]

My heart felt ambition is - by your blessings, I should be in such a place, where good persons exist, with "ATMAGNANA" and devotees of Parameswara and myself living like a small fish in a clean water to the full brim of a lake and pass my days with free-mind. This will do for me, Gurujee ! This will provide me with "Nityanandam" as well as "Brahmanandam".

* * *

హంసం బబ్జ వనమ్ముc జాతకము

నీలాబ్దమ్మునున్‌ దా దివో

త్తంసున్‌ సూర్యునిc గోకమున్‌;

ఘన సుధా ధామున్‌ జకోరమ్ము - న

స్రంస ద్వైఖరిc గోరునట్లు

మది మీసాన్నిధ్యమే గోరెడిన్‌

హంసోత్తంసమ! చంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 107

[ఓ యతీంద్రా! హంస పద్మవనాన్నీ, చాతకం నీల మేఘాన్నీ, కోకం సూర్యుణ్ణి, చకోరపక్షి చంద్రుణ్ణీ వాంఛించే టట్లుగా - నా మనస్సు మీ సాన్నిధ్యాన్నే గాఢంగా కోరుతూ వుంది.]

Swamijee [Oh ! Yatheendra]! My mind always crave you just as Swan liking Lotus garden, the 'Chatakam' bird liking the 'Megham' (full of clouds), lotus flower liking the sun God, the 'Chakora' bird liking the Moon God-to be under your Lotus-like feet.

* * *

కలలో నేని భవ త్పదాబ్జ విలస

త్కల్యాణ మారంద పూ

ర లసత్పానము వీడc బోమను సుమీ!

లాక్షారుణో పేత మం

జుల పాదద్వయి నర్చ సల్పుటది

యెచ్చో టేగినన్‌ బాయ - వ

త్సలతన్‌ బ్రోవుము చంద్రశేఖర యతీంద్రా!

భక్త ముక్తి ప్రదా! 108

(చూ. కవరు పేజి)

[ఓ స్వామీ! చిత్త విభ్రమం చెంది తుమ్మెదలాగా సంసార మనే యెడారిలో వృథాగా పరిభ్రమిస్తున్న నేను నా పూర్వపుణ్య విశేషం కొద్దీ లభించిన మీ పాదపద్మ మకరందాన్ని ఆస్వాదించడం కలలో గూడా విడువను సుమా ! మిక్కిలి యెఱ్ఱనై కుసుమ కోమలమైన మీ పాదాలను ధ్యానించడం ఎక్కడ కేగినా విస్మరింపను. ఇట్టి నన్ను దయతో కాపాడలేవా తండ్రీ!]

Oh ! Dearest father of fathers, permit me to express that- though having no sound mind and wasting my time in the desert of "SAMSARAM" as the Butterfly lingers. But at last to my past good deeds, I have been and shall be always sucking the honey of your reputed lotus feet. This I will be doing wherever and whenever I be. Oh ! God Father ! Kindly bless me with pleasure.

* * *

Prathyaksha Daivamu    Chapters    Last Page